వింటేజ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్

Saturday,November 16,2019 - 10:28 by Z_CLU

ఖచ్చితంగా ప్లాన్ చేసుకుని ఉండదు కానీ ఈ మధ్య పాయల్ రాజ్ పుత్ కి రెట్రో గెటప్ లో ఉండే క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తుందనిపిస్తుంది. డెబ్యూ సినిమా RX100 తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ పంజాబీ భామ ఇప్పుడు క్లాసిక్ లుక్స్ లో మెస్మరైజ్ చేస్తుంది.

వెంకీమామ : సినిమా మొత్తం ఇలాగే కనిపిస్తుందా..లేకపోతే జస్ట్ కొన్ని సీక్వెన్సెస్ కే పరిమితమా అన్నది ఖచ్చితంగా చెప్పలేం కానీ… ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతున్న సాంగ్ ని బట్టి పాయల్ రాజ్ పుత్ వింటేజ్ గెటప్ లో ఖచ్చితంగా మెస్మరైజ్ చేయనుంది.

డిస్కోరాజా : ఇప్పటికే రిలీజైన ‘నువ్వు నాతో ఏమన్నావో…’ సాంగ్ లో ఆడియో కూడా రెట్రో ఫీల్ లోనే ఉంది. ఇక పడాల్సింది విజువల్సే. ఈ సాంగ్ కూడా రవితేజ, పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లోనే ఉండబోతుంది.

కథానాయకుడు : NTR బయోపిక్ లో కనిపించింది కాసేపే అయినా సీనియర్ నటి జయసుధ లా కనిపించింది పాయల్ రాజ్ పుత్. బాలయ్య సరసన వింటేజ్ మార్క్ స్టెప్పులు కూడా వేసింది.