ఇది ఫిక్స్ - పవన్ సినిమా సంక్రాంతికే

Saturday,September 02,2017 - 12:33 by Z_CLU

మొన్నటివరకు పవన్ కల్యాణ్ 25వ సినిమాపై చాలామందికి చాలా అనుమానాలు ఉండేవి. షూటింగ్ లేట్ అవుతోందని కొందరు అంటే, రిలీజ్ వాయిదా పడుతుంది మరికొందరన్నారు. కానీ ఈ అనుమానాలన్నింటికీ చెక్ పెట్టింది యూనిట్. సంక్రాంతికి వస్తున్నామంటూ సగర్వంగా ప్రకటించింది.

సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న పవన్ సినిమా థియేటర్లలోకి రానుంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా సర్ ప్రైజ్ మ్యూజికల్ గిఫ్ట్ అందించారు. అందులోనే సినిమా విడుదల తేదీని ప్రకటించారు. అయితే

పవన్ బర్త్ డే సందర్బంగా టైటిల్ మాత్రం ఎనౌన్స్ చేయలేదు. దానికి మరో స్పెషల్ డేట్ ను ఫిక్స్ చేశారట. సంక్రాంతికి పవన్ సినిమాలు రావడం చాలా అరుదు. రెగ్యులర్ గా సంక్రాంతికి రాడు పవన్. ఈసారి మాత్రం తన ప్రతిష్టాత్మక 25వ చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే 70శాతం షూటింగ్ కూడా పూర్తవ్వడంతో.. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కు, ప్రమోషన్ కు చాలా టైం దొరుకుతుంది.