"లై" నుంచి నిమిషం వీడియో సాంగ్

Sunday,July 30,2017 - 11:05 by Z_CLU

తెలంగాణ ఫోక్ బీట్ తో తెరకెక్కిన బొంబాట్ సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్ అయింది. మణిశర్మ కంపోజ్ చేసిన ఈ పాట ఇనిస్టెంట్ గా జనాలకు ఎక్కేసింది. ఆ తర్వాత మిస్ సన్ షైన్ అంటూ విడుదల చేసిన రొమాంటిక్ మెలొడీ కూడా జనాలకు అంతే నచ్చింది. ఇప్పుడు అదే పాటకు సంబంధించి వీడియో రిలీజ్ చేశారు. ఒక నిమిషం నిడివి కలిగిన ఈ పాట ప్రస్తుతం టాప్ ట్రెండింగ్స్ లో కొనసాగుతోంది.

నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకుడు. 14 రీల్స్ ఎఁటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించింది. ఆగస్ట్ 11న సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

నితిన్ ఈ సినిమాలో సరికొత్తగా ముస్తాబయ్యాడు. అతడి మేకోవర్ కు మంచి మార్కులు పడ్డాయి. సీనియర్ నటుడు అర్జున్ ఓ కీలక పాత్ర పోషించిన లై సినిమా.. యాక్షన్ ఎంటర్ టైనర్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది.