Ghani సింగిల్ గా వస్తున్న వరుణ్ తేజ్

Tuesday,April 05,2022 - 01:43 by Z_CLU

No tough competition for Varun Tej’s ‘Ghani’ this Week

 

ఈ వారం స్పోర్ట్స్ యాక్షన్ సినిమాతో థియేటర్స్ లోకి వస్తున్నాడు వరుణ్ తేజ్. చాలా నెలలుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమన్ మ్యూజిక్ , ట్రైలర్ సినిమాపై రిలీజ్ కి ముందే మంచి బజ్ క్రియేట్ చేశాయి. దీంతో వరుణ్ సినిమా చూసేందుకు ఆడియన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు.

అయితే ప్రతీ వారం రెండు మూడు మీడియం బడ్జెట్ సినిమాలు పోటీ పడటం కామనే. కానీ ఈ వారం గనికి ఆ రేంజ్ పోటీ సినిమా లేదనే చెప్పాలి. రెండు మూడు చిన్న సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. దీంతో పెద్దగా కంపిటీషన్ లేకుండా సింగిల్ గా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు మెగా ప్రిన్స్. కాకపోతే వచ్చే వారం నుండి మాత్రం ‘గని’ కి గట్టీ పోటీ ఉండనుంది. ఏప్రిల్ 13 న  విజయ్ ‘బీస్ట్’ , ఏప్రిల్ 14న  యష్ ‘KGF 2’, సినిమాలు విడుదలవుతున్నాయి.

ఈ సినిమా కోసం ఎన్నో నెలలు కష్టపడ్డాడు వరుణ్. తన కష్టానికి మంచి ఫలితం వస్తుందనే ధీమాతో ఉన్నాడు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్ కూడా సినిమా చూశానని తనకి బాగా నచ్చిందని చెప్పడంతో సినిమాపై హైప్ పెరిగింది. అల్లు అరవింద్ తనయుడు అల్లు బాబీ నిర్మాతగా పరిచయమవుతున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకుడు.

 వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఉపేంద్ర , సునీల్ శెట్టి , నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని యూనిట్ చెప్తున్నారు. మరి ఎలాంటి కంపీటిషణ్ లేకుండా సింగిల్ గా వస్తున్న ‘గని’ ఈ వారం  బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుందో ? చూడాలి.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics