రేపే కిరాక్ పార్టీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్

Friday,March 09,2018 - 01:39 by Z_CLU

నిఖిల్ హీరోగా నటించిన సినిమా కిరాక్ పార్టీ. వచ్చే శుక్రవారం విడుదలకానున్న ఈ సినిమాకు మరింత ప్రచారం కల్పించేందుకు ప్రీ-రిలీజ్ ఫంక్షన్  కమ్ ఆడియో రిలీజ్ ను ఒకేసారి సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు. ఆ ఫంక్షన్ ను సంబంధించి డేట్, ప్లేస్ ఫిక్స్ చేశారు. రేపు విజయవాడలోని ఉషారామా ఇంజినీరింగ్ కాలేజీలో కిరాక్ పార్టీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరగనుంది.

ఈ సినిమాకు సంబంధించి ఇంకా ట్రయిలర్ విడుదల చేయలేదు. కుదిరితే రేపటి ఫంక్షన్ లో లేదా మరో రోజు గ్యాప్ ఇచ్చి ట్రయిలర్ ను విడుదల చేయబోతున్నారు. శరణ్ కొప్పిశెట్టి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాతో సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరిన్జా హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. అజనీష్ లోక్ నాధ్ సంగీతం అందించాడు. దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే సమకూర్చగా..మరో దర్శకుడు చందు మొండేటి మాటలు రాశాడు.