Nikhil’s 18 Pages Movie to release on December 23
ఇటీవలే కార్తికేయ-2 సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు నిఖిల్. ఇప్పుడు 18-పేజెస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. కార్తికేయ-2లో నిఖిల్ తో కలిసి నటించిన అనుపమ పరమేశ్వరన్.. 18-పేజెస్ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడీ మూవీకి రిలీజ్ డేట్ లాక్ అయింది. డిసెంబర్ 23న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది 18 Pages Movie.
ఈ సినిమాకు సూపర్ హిట్ డైరక్టర్ సుకుమార్ కథ అందించాడు. గతంలో కుమారి 21 ఎఫ్ చిత్రానికి కూడా సుకుమారే కథను అందించాడు. అతని శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి GA2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎండింగ్ కు చేరుకుంది. షార్ట్ గ్యాప్ తర్వాత, తిరిగి సెట్స్ పైకి వచ్చింది. రీసెంట్ గా ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఓ యాక్షన్ బ్లాక్ తీస్తున్నారు.
సినిమాటోగ్రాఫర్ ఎ వసంత్, ఎడిటర్ నవీన్ నూలి ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
