Nikhil SPY నిఖిల్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్

Friday,June 30,2023 - 04:52 by Z_CLU

నిఖిల్ సిద్దార్థ్ పాన్ ఇండియా మూవీ స్పై తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి అంచనాలతో థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చిన స్పై తొలి రోజు డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. నిఖిల్ కెరీర్ లోనే హై య్యస్ట్ గ్రాసర్ ఓపెనర్ గా నిలిచింది స్పై. ‘కార్తికేయ 2’ తర్వాత నిఖిల్ నుండి వచ్చిన పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ వరల్డ్ వైడ్ గా మంచి కలెక్షన్స్ అందుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు మొదటి రోజు 11.7  కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

ఈ వీకెండ్ కల్లా సినిమా 20 కోట్ల గ్రాస్ దాటేయడం పక్కా అనిపిస్తుంది. రిలీజ్ కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుపుకున్న ఈ సినిమా  టేబుల్ ప్రాఫిట్ తో  విడుదల కావడం విశేషం.

spy-nikhil-zeecinemalu