Natyam - సంధ్యారాజు సినిమాకు అరుదైన గౌరవం

Monday,November 08,2021 - 01:26 by Z_CLU

క్లాసికల్ డాన్స్ బ్యాక్ డ్రాప్ తో తీసిన సినిమా ‘నాట్యం’. ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాదికిగానూ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ప్రదర్శనకు ఎంపికైన ఏకైక తెలుగు చిత్రంగా నిలిచింది నాట్యం.

భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ, కూచిపూడి నృత్యం ఆధారంగా సంధ్యారాజు నటించి నిర్మించిన ఈ మూవీ, టాలీవుడ్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈనెల 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్న 52వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని భాషల నుంచి ఎన్నో సినిమాలు రాగా, నాట్యం సినిమా మాత్రమే తెలుగు నుంచి ప్రదర్శనకు ఎంపికవ్వడం విశేషం.

natyam movie review in telugu zeecinemalu

తమ సినిమా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు ఎంపికైన సందర్భంగా నాట్యం యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటుచేసింది. ఇండియన్ పనోరమ విభాగంలో నాట్యం సినిమాను ఎంపిక చేసినందుకు జ్యూరీ సభ్యులకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పింది.

natyam  movie

“డ్యాన్స్, వ్యాపార రంగం నుంచి వచ్చిన మీరు నాట్యం లాంటి సినిమాను ఎందుకు చేస్తున్నారని చాలామంది అడిగారు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు మా సినిమా సెలక్ట్ అవ్వడమే ఆ ప్రశ్నకు సమాధానం. మా చిత్రానికి ఆ అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది’’ అని సంధ్యారాజు అన్నారు.

natyam

దర్శకుడు రేవంత్ కోరుకొండ డైరక్ట్ చేసిన ఈ సినిమాను చిరంజీవి, బాలకృష్ణ, రామ్ చరణ్ లాంటి ఎంతోమంది స్టార్స్ ప్రమోట్ చేశారు. నాట్యం లాంటి సినిమాలు రావాలన్నారు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు ఈ సినిమా ఎంపికవ్వడంతో.. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కూడా ‘నాట్యం’ బృందాన్ని ప్రత్యేకంగా మెచ్చుకుంది.