Nani First Look And Spark Of Dasara Video Out from Dasara Movie
అప్పుడప్పుడు మాస్ మూవీస్ ట్రై చేశాడు నాని. కృష్ణార్జున యుద్ధంలో అతడు చేసిన మాస్ క్యారెక్టర్ కు మంచి పేరొచ్చింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో మాస్ రోల్ చేస్తున్నాడు నాని. ఇందులో ఇతడి రోల్ మాత్రమే కాదు, టోటల్ సినిమా అంతా మాస్-యాక్షన్ తో నిండిపోయింది. అదే దసరా సినిమా
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతోంది దసరా. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకానున్న నాని మొదటి పాన్ ఇండియా చిత్రం ఇదే.
సుధాకర్ చెరుకూరి తన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌లో దసరాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీర్తి సురేష్ హీరోయిన్.
దసరా షూటింగ్ ఈమధ్యే మొదలైంది. ఈరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు స్పార్క్ ఆఫ్ దసరా పేరుతో గ్లింప్స్ కూడా విడుదల చేశారు. పోస్టర్‌లో లుంగీ కట్టుకున్న నాని.. పక్కనే నిప్పు ఉండటం దాంట్లో చెయ్యి పెట్టి బీడీ వెలిగించడం హైలెట్. బీడీ వెలిగించి సింగరేణి మైన్స్ ద్వారా తన గ్యాంగ్‌తో కలిసి నడుస్తూ స్టైల్ గా ఎంట్రీ ఇచ్చాడు. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్ కు మంచి లుక్ తీసుకొచ్చింది.
గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్ దగ్గర ఉన్న ఒక గ్రామంలో జరిగే కథ ఇది. నాని ఇందులో మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రను పోషిస్తున్నాడు. కీర్తిసురేష్ హీరోయిన్.

- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics