ముందు సోనాక్షి.. వెనక నందిత శ్వేత

Tuesday,December 17,2019 - 02:06 by Z_CLU

హెడ్డింగ్ కన్ఫ్యూజన్ గా అనిపించినా మేటర్ మాత్రం క్లియర్. తెరపై సోనాక్షి సిన్హా కనిపిస్తుంది. ఆమెకు సంబంధించి వినిపించే గొంతు మాత్రం మరో హీరోయిన్ నందిత శ్వేతది. అవును.. సోనాక్షీ సిన్హాకు సౌత్ లో డబ్బింగ్ చెబుతోంది నందిత శ్వేత.

ప్రభుదేవా దర్శకత్వంలో దబంగ్-3 చేశాడు సల్మాన్. ఇందులో సోనాక్షి హీరోయిన్ గా నటించింది. హిందీతో పాటు ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ మూడు భాషల్లో సోనాక్షికి, నందిత శ్వేత డబ్బింగ్ చెప్పడం విశేషం.

నందితకు 3 భాషలపై మంచి పట్టుంది. ఈ 3 భాషల్లో తన పాత్రలకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఆ అనుభవంతో దబంగ్-3కి మూడు భాషల్లో తనే డబ్బింగ్ చెప్పింది.

ఇదంతా నందిత ఎందుకు చేసిందో తెలుసా? కేవలం ప్రభుదేవాపై గౌరవంతో. ఆయన రిక్వెస్ట్ చేశాడు కాబట్టి ఇదంతా చేశానంటోంది నందిత శ్వేత.