Krishna Vrinda Vihari టీజర్ తో మెప్పించిన శౌర్య

Monday,March 28,2022 - 04:55 by Z_CLU

Naga Shaurya’s ‘Krishna Vrinda Vihari’ Teaser talk

హీరో నాగ శౌర్య , శిర్లె సేటియ జంటగా అనీష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో మూవీ లవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తుంది.

నిమిషం 47 సెకన్లతో సినిమాలో ఉండే కంటెంట్ ని క్రిస్ప్ గా చూపిస్తూ యూత్ ని ఎట్రాక్ట్ చేసేలా టీజర్ కట్ చేశారు. ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో వర్క్ చేసే కృష్ణ వ్రింద అనే అమ్మాయితో ప్రేమలో పడటం, తర్వాత వారిద్దరి మధ్య ఓ చిన్న ఇష్యూ జరగడంతో కృష్ణ ని వ్రింద దూరం పెట్టడం వంటి అంశాలతో దర్శకుడు ఈ లవ్ స్టోరీ రాసుకున్నాడని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక టీజర్ లో విజువల్స్ , రొమాంటిక్ సీన్స్ , ప్లీసెంట్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. శౌర్య , శిర్లె కెమిస్ట్రీ కూడా సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలవనుందని టీజర్ లో వచ్చే రొమాంటిక్ సీన్స్ తెలిసిపోతుంది.

డైరెక్టర్ అనీష్ కృష్ణ తన మార్క్ ఎంటర్టైన్ మెంట్ మిక్స్ చేసి  ఓ క్యూట్ లవ్ స్టోరీ చూపించబోతున్నాడని టీజర్ తో హింట్ ఇచ్చాడు. ఐరా క్రియేషన్స్ బేనర్ పై ఉష ముల్పూరి నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 22న విడుదల కానుంది. త్వరలోనే ఆల్బం నుండి లిరికల్ వీడియోస్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics