పక్కింటి కుర్రాడిగా నాగచైతన్య

Saturday,November 23,2019 - 01:36 by Z_CLU

పక్కింటి కుర్రాడి పాత్రల్లో నాగచైతన్యను ఇప్పటికే చూశాం. అయితే శేఖర్ కమ్ముల హీరోగా మాత్రం చూడలేదు. నిజానికి కమ్ముల సినిమాల్లో హీరోలు హీరోలుగా కనిపించరు. కేవలం పాత్రలుగా మాత్రమే కనిపిస్తారు. తాజా చిత్రంలో కూడా చైతూ అలానే కనిపించాడు. చాలా సాదాసీదాగా ఉన్నాడు.

నాగ చైతన్య పుట్టినరోజు కానుకగా ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. ఫిట్ నెస్ సెంటర్లో పనిచేస్తూ, సాదా సీదా బట్టల్లో చైతూ చాలా ఆర్డినరీ బాయ్ లా కనిపిస్తున్నాడు. అలాగే చైతు పాత్ర కూడా డిప్రెషన్ మరియు ఎమోషనల్ గా ఉంది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.