Most Eligible Bachelor - మరో రిలీజ్ డేట్

Saturday,August 28,2021 - 11:50 by Z_CLU

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో  మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రకటించిన రోజు నుంచి కూడా ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌ టీం విడుదల చేసిన ప్రతి అప్డేట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

కంటెంట్ కు అటు సోషల్ మీడియాలో.. ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్‌లో కొత్త ఉత్సాహ‌న్ని తెచ్చింది. ఇదే ఉత్సాహంతో అక్కినేని అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ యూనిట్ తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్.

ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు. అందుకే ఆయ‌న చిత్రాల‌కి ఓ ప్రత్యేకత వుంటుంది. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అఖిల్ అక్కినేని, పూజాల మధ్య కూడా అలాంటి కెమిస్ట్రి ఉండేలా డిజైన్ చేసారు.

Most Eligible Bachelor

న‌టీ న‌టులు:
అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు..

సాంకేతిక నిపుణులు:
దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్
నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌
బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్
స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్
మ్యూజిక్ : గోపీ సుంద‌ర్
సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ
ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్
ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా
పీఆర్ఓ : ఏలూరు శ్రీను

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics