Godfather జూలై 4న ఫస్ట్ లుక్

Saturday,July 02,2022 - 04:41 by Z_CLU

Megastar’s ‘Godfather’ First Look On July 4th

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక ‘గాడ్ ఫాదర్’ చిత్రం కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రం నుండి మెగా ఉప్దేట్ వచ్చింది. గాడ్‌ఫాదర్  ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జూలై 4న సాయంత్రం 5:45 గంటలకు లాంచ్ చేయనున్నారు. గాడ్‌ఫాదర్ రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నట్లు చిత్ర యూనిట్ ఓ పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా ఫస్ట్ లుక్ డేట్ ని ప్రకటించింది.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు మెగాస్టార్లకు ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించే ఓ బాబింగ్ సాంగ్ వుంది. ఈ స్పెషల్ డ్యాన్స్ నంబర్‌కు  ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయగా ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

టాప్ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా, స్టార్ దర్శకుడు పూరి జగన్నాధ్ అతిధి పాత్రలో కనిపించనున్నారు.  సత్యదేవ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

టాప్ టెక్నికల్‌ టీమ్‌ గాడ్ ఫాదర్  కోసం పని చేస్తున్నారు. వెటరన్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తుండగా, సంగీత సంచలనం ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. అనేక బాలీవుడ్ హిట్ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన సురేష్ సెల్వరాజన్ ఈ చిత్రానికి ఆర్ట్‌వర్క్‌ అందిస్తున్నారు.

ఆర్‌బి చౌదరి, ఎన్వీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు.

 

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics