Vishnu Manchu 'గాలి నాగేశ్వరరావు' గా మంచు విష్ణు

Saturday,March 05,2022 - 06:37 by Z_CLU

ఇంట్రస్టింగ్ క్యారెక్టరైజేషన్ తో మంచు విష్ణు ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి కోన వెంకట్, చోటా.కె.నాయుడు, అనూప్ రూబెన్స్ వంటి క్రేజీ టెక్నీషియన్స్ సెట్ అవ్వడం సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

డా. మంచు మోహన్ బాబు గారి ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా కోన వెంకట్ వ్యవహరించనున్నాడు. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. జి.నాగేశ్వర రెడ్డి మూలకథ అందించారు.

కాగా ఈ సినిమాలో తన చేస్తున్న ‘గాలి నాగేశ్వరరావు’ క్యారెక్టర్ గెటప్ ని ఆర్ట్ ద్వారా తన ట్విట్టర్ లో రివీల్ చేసాడు మంచు విష్ణు. ఇప్పటి వరకూ చేయని ఓ ఎంటర్టైనింగ్ పాత్రతో ఈ సినిమాలో  కనిపించనున్నాడు  విష్ణు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. మిగతా  వివరాలను  త్వరలోనే వెల్లడించడానికి ప్లాన్ చేస్తోంది చిత్రం యూనిట్.

 

 

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics