#Mahesh28 - లిస్టులో మరో బ్యూటీ?

Wednesday,June 09,2021 - 04:04 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ #SSMB28 ఎనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టేజిలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. సినిమాకు సంబంధించి కాస్టింగ్ తో పాటు టెక్నీషియన్స్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ని తీసుకుంటారని మొన్నటివరకు ప్రచారం జరిగింది. ఆ తర్వాత శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ని ఫైనల్ చేయనున్నారనే టాక్ వినబడింది. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో హీరోయిన్ చేరింది.

Malavika_Mohanan_stills_మాళవిక_మోహనన్-zeecinemalu

                              మాళవిక మోహనన్

ఇటివలే విజయ్ మాస్టర్ సినిమాలో నటించిన మళవికా మోహనన్ ని త్రివిక్రమ్ మహేష్ సినిమాతో తెలుగు హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ అందరూ బజీగా ఉండటంతో త్రివిక్రమ్ ఈ కోలీవుడ్ బ్యూటీ ని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా ఎనౌన్స్ అయినప్పటి నుండి హీరోయిన్ ఎవరా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. దానికి తగ్గట్టే రోజుకో హీరోయిన్ పేరు తెరపైకి వస్తుంది.

మరి నిజంగా త్రివిక్రమ్ మహేష్ సినిమాకు మాళవికా మోహనన్ ని తీసుకుంటాడా? లేదా తనకి కలిసొచ్చిన సెంటిమెంట్ హీరోయిన్ పూజా హెగ్డే నే మళ్ళీ రిపీట్ చేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా మేకర్స్ మహేష్ సినిమాకు హీరోయిన్ ఈమె అంటూ ఆమె కి వెల్కం చెప్పే వరకూ ఈ సినిమా హీరోయిన్ పై రోజుకో వార్త పుట్టుకొస్తుంది. మరి త్రివిక్రమ్ అండ్ టీం మహేష్ కి జోడిగా నటించబోయే హీరోయిన్ ని ఎప్పుడు ప్రకటిస్తారో ?

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics