మజిలీ మూవీ ఫస్ట్ డే కలెక్షన్

Saturday,April 06,2019 - 11:37 by Z_CLU

తన కెరీర్ లోనే రెండో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు నాగచైతన్య. మజిలీ సినిమా చైతూకు ఈ రికార్డు తెచ్చిపెట్టింది. నిన్న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 7 కోట్ల 46 లక్షల రూపాయల నెట్ వచ్చింది.

చైతూ కెరీర్ లో ఇప్పటివరకు హయ్యస్ట్ ఓపెనర్ శైలజారెడ్డి అల్లుడు సినిమా. ఆ మూవీ సాధించిన ఫస్ట్ డే కలెక్షన్లను మజిలీ క్రాస్ చేయలేకపోయింది. అయితే శైలజారెడ్డి అల్లుడితో పోలిస్తే నైజాం, గుంటూరు, ఉత్తరాంధ్రలో మజిలీ సినిమాతో తమ మార్కెట్ ను ఇంకాస్త పెంచుకోగలిగాడు చైతూ.

ఏపీ,నైజాం ఫస్ట్ డే షేర్స్
నైజాం – రూ. 1.85 కోట్లు
సీడెడ్ – రూ. 0.68 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.76 కోట్లు
ఈస్ట్ – రూ. 0.29 కోట్లు
వెస్ట్ – రూ. 0.27 కోట్లు
గుంటూరు – రూ. 0.66 కోట్లు
కృష్ణా – రూ. 0.36 కోట్లు
నెల్లూరు – రూ. 0.16 కోట్లు