Love Story - ఫస్ట్ డే కలెక్షన్

Saturday,September 25,2021 - 04:55 by Z_CLU

భారీ అంచనాల మధ్య విడుదలైన లవ్ స్టోరీ సినిమా మొదటి రోజు మెరిసింది. వారం రోజుల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగడం, సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రావడంతో మొదటి రోజు ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి.

వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 9 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి అటుఇటుగా 6.5 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఏపీలో 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయి. లాక్ డౌన్ వల్ల సెకెండ్ షోలు కూడా పడడం లేదు. అయినప్పటికీ ఈ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం గొప్ప విషయం.

ఇక ఓవర్సీస్ విషయానికొస్తే.. ఈ ఏడాది ప్రీమియర్స్ ద్వారా హయ్యస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా లవ్ స్టోరీ రికార్డ్ సృష్టించింది. అంటే యూఎస్ లో కూడా లవ్ స్టోరీ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారనే విషయం అర్థమైంది. తొలిరోజు ప్రీమియర్స్ తో కలుపుకొని ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ డాలర్ వసూళ్లు వచ్చాయి.

ఏపీ, నైజం ఫస్ట్ డే షేర్లు
నైజాం – రూ. 3.05 కోట్లు

సీడెడ్ – రూ. 1 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ .55 లక్షలు

ఈస్ట్ – రూ. 46 లక్షలు

వెస్ట్ – రూ. 56 లక్షలు

గుంటూరు – రూ. 59 లక్షలు

కృష్ణ – రూ. 32 లక్షలు

నెల్లూరు – రూ. 25 లక్షలు

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics