Vikrant Rona రేపే గ్రాండ్ రిలీజ్

Wednesday,July 27,2022 - 11:40 by Z_CLU

Kichha Sudeep’s Vikranth Rona Grand Release Tomorrow

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘విక్రాంత్ రోణ’ రేపే గ్రాండ్ గా రిలీజవుతోంది. జీ స్టూడియోస్ , సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ , కిచ్చా క్రియేషన్ సమర్పణలో జాక్ మంజునాథ్ , శాలినీ మంజునాథ్ నిర్మించిన ఈ సినిమాకు అనూప్ బండారి దర్శకత్వం వహించారు. ఇప్పటికే టీజర్ , ట్రైలర్ తో పాటు రారా రక్కమ్మ అనే సాంగ్ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేస్తూ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది.

అటవీ ప్రాంతంలో ఉండే ఓ ఊరు , అక్కడ ఓ భయంకరమైన కథను దాచాలనుకోవడం దాన్ని చేధించాడానికి భయం లేని  విక్రాంత్ రోణ అక్కడికి వెళ్ళడం , అలా వెళ్ళాక తనకు ఎదురైన సంఘటనలేంటి ? వాటిని విక్రాంత్ రోణ ఎలా ఎదుర్కున్నాడు ? అనే ఇంట్రెస్టింగ్ స్టోరీతో యాక్షన్ ఫాంటసీ గా రూపొందిన ఈ సినిమాపై అన్ని భాషల్లోనూ మంచి అంచనాలున్నాయి. హిందీలో సల్మాన్ ఖాన్ ప్రెజెంట్ చేస్తుండటం అక్కడ టీంతో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొనడంతో బాలీవుడ్ లో కూడా మంచి బజ్ క్రియేట్ అయింది.

భారీ అంచనాల నడుమ రేపే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న ‘విక్రాంత్ రోణ’ తో కిచ్చా సుదీప్ మరో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమనిపిస్తుంది. సుదీప్ యాక్టింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గ్లామర్ ,   గ్రాండియర్ విజువల్స్ ,  సాంగ్స్ , ఊహించని ట్విస్టులతో పాటు అజనీష్ లోక్నాథ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవ్వనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics