తారక్ - త్రివిక్రమ్ ... త్వరలోనే అనౌన్స్ మెంట్ !

Sunday,January 12,2020 - 09:32 by Z_CLU

ప్రస్తుతం చరణ్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ నెక్స్ట్ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటివలే ‘అరవింద సమేత’ సినిమా చేసిన ఈ కాంబోలో తెరకెక్కే సినిమాపై ఇంకా క్లారిటీ లేదు. అయితే లేటెస్ట్ గా ఈ విషయంపై లీక్ వదిలాడు త్రివిక్రమ్.

“నెక్స్ట్ తారక్ తో సినిమా చేస్తున్నారుగా” అనే ప్రశ్నకు నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదని చెప్తూ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉంటుంది. అప్పటి వరకూ సస్పెన్స్ అన్నాడు. సో అతి త్వరలోనే త్రివిక్రమ్ -తారక్ కాంబోలో వస్తున్న రెండో సినిమాపై అధికారిక ప్రకటన రానుందన్నమాట.