మరికొన్ని గంటల్లో ఇస్మార్ట్ ట్రయిలర్

Wednesday,July 03,2019 - 12:46 by Z_CLU

పూరి యూనిట్ నుంచి సడెన్ గా ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. రామ్-పూరి కాంబోలో మోస్ట్ ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ మూవీ ట్రయిలర్ ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు పూరి జగన్నాధ్ స్వయంగా ఎనౌన్స్ చేశాడు.

ఇస్మార్ట్ శంకర్ టీజర్ ఇప్పటికే పెద్ద హిట్ అయింది. రామ్ ను ఇప్పటివరకు చూడని మేకోవర్ లో, మేనరిజమ్స్ లో చూసిన ఆడియన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు. మరోవైపు టీజర్ తో పాటు సాంగ్స్ కూడా ఎప్పటికప్పుడు హిట్ అవుతున్నాయి. ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ అన్నీ హిట్ అయ్యాయి. టైటిల్ సాంగ్ అయితే కిర్రాక్

ఇప్పుడు అదే ఊపులో ఇస్మార్ట్ శంకర్ ట్రయిలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. త్వరలోనే సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి.. 18న మూవీని వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తారు. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించాడు.