#RC15 - భారీగా ప్లాన్ చేస్తున్న శంకర్

Wednesday,April 21,2021 - 01:30 by Z_CLU

రామ్ చరణ్ తో శంకర్ పాన్ ఇండియా లెవెల్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు , తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా ఐదు భాషల్లో తెరకెక్కించనున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ ఉందట. ఆ పాత్రను ఒక్కో లాంగ్వేజ్ లో ఒక్కో హీరోతో చేయించాలని చూస్తున్నారట. హిందీలో సల్మాన్ ఖాన్, తమిళ్ లో విజయ్ సేతుపతి, కన్నడలో యష్ లేదా సుదీప్ ని అనుకుంటున్నారట.

ఇక తెలుగు, మలయాళంలో ఇంకా ఎవర్నీ తీసుకోవాలనే విషయంపై డిస్కషన్ నడుస్తుందని తెలుస్తుంది. ఇలా అన్ని భాషల్లో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు నెలకొనేలా భారీ ప్లానింగ్ లో వెళ్తున్నాడట శంకర్. క్యారెక్టర్ కి అన్ని భాషల్లో హీరోలు సెట్ అవ్వగానే అఫీషియల్ గా అందరి పేర్లు ప్రకటించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

ఇక తన బేనర్ లో వస్తున్న యాబై వ సినిమా కావడంతో మేకింగ్, కాస్ట్ అండ్ క్రూ విషయంలో ఎక్కడా తగ్గొద్దని శంకర్ కి సూచిస్తున్నాడట దిల్ రాజు. అందుకే శంకర్ ఈ సినిమాను భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే హీరోయిన్ కోసం బాలీవుడ్ లో కొందరు పేర్లను పరిశీలిస్తున్న శంకర్ ఆల్మోస్ట్ కొందరు టెక్నీషియన్స్ ని ఫైనల్ చేశాడని అంటున్నారు. ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తాడని చెన్నై టాక్.

ప్రస్తుతం RRR షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్న చరణ్ త్వరలోనే శంకర్ సినిమాలో జాయిన్ అవుతాడు. కరోన ప్రభావం కాస్త తగ్గగానే అంటే జూన్ లేదా జులై లో ఈ కాంబో సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. దిల్ రాజు , శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానుంది.

ఈ సినిమా పూర్తయిన తర్వాత శంకర్ హిందీలో రన్వీర్ తో అపరిచుతుడు రీమేక్ చేయనున్నాడు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics