105 Minutes - హన్సిక సినిమా షూటింగ్ అప్ డేట్స్

Tuesday,August 10,2021 - 12:05 by Z_CLU

ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనం తో తెరకెక్కుతోన్న చిత్రం “105 మినిట్స్”. హన్సిక మొత్వాని హీరోయిన్. ”సింగిల్ షాట్” “సింగిల్ క్యారెక్టర్ ” “రీల్ టైం & రియల్ టైం ” ఈ చిత్రానికి హైలైట్స్.

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలోని ఓ ఇంట్లో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. తాజాగా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు యూనిట్ రెడీ అవుతోంది. నిన్న హీరోయిన్ హన్సిక పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంది. 30వ ఏట ఆమె అడుగు పెట్టింది. ఈ సందర్భంగా “105 మినిట్స్” చిత్రం యూనిట్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. అలాగే హన్సిక ఫస్ట్ లుక్ ను ప్రముఖ డైరెక్టర్ బాబి విడుదల చేసి, ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేసారు.

105 minutes hansika

ఈ సినిమాపై హన్సిక చాలా హోప్స్ పెట్టుకుంది. యాక్టింగ్ కు స్కోప్ ఉండే పాత్రల్ని సెలక్ట్ చేసుకుంటున్న ఈ బ్యూటీ.. తన కెరీర్ లో ఇప్పటివరకు ఎప్పుడూ ఇలాంటి పాత్ర పోషించలేదు. షూటింగ్ కు తక్కువ రోజులే టైమ్ పట్టినప్పటికీ.. కొత్త కాన్సెప్ట్, కొత్త స్క్రీన్ ప్లే కావడంతో చాలా కష్టపడ్డానని తెలిపింది ఈ ఆపిల్ బ్యూటీ. ఈ మూవీతో తెలుగులో మరోసారి తనకు క్రేజ్ రావడం గ్యారెంటీ అంటోంది.

రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో రాజు దుస్సా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సామ్ సి.యస్ సంగీతం సమకూర్చుతున్నారు.

105 minutes hansika

సాంకేతిక వర్గం
నిర్మాత – బొమ్మక్ శివ
డైరెక్టర్ – రాజు దుస్సా
డిఓపి – కిషోర్ బొయిదాపు
మ్యూజిక్ – సామ్ సి.యస్
ఆర్ట్ – బ్రహ్మ కడలి
స్ర్కిఫ్ట్ చీఫ్ అసోసియేట్ – రూపాకిరణ్ గంజి
స్టిల్స్ – గుణకర్
మేకప్ – డెక్క బాలు
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ – సురేష్ బాబు
పబ్లిసిటీ డిజైనర్ – సుధీర్

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics