105 Minutes - హన్సిక తెలుగు సినిమా స్టార్ట్

Thursday,July 22,2021 - 01:07 by Z_CLU

”కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాను. చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. ఈ టీమ్ కి ఆల్ ది బెస్ట్” అంటూ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ చేసారు బబ్లీ గర్ల్ హన్సిక. ఇంతలా తను ఎగ్జయిట్ అవ్వడానికి కారణం ప్రస్తుతం హన్సిక చేస్తున్న తాజా చిత్రం ‘105 మినిట్స్’.

hansika new stills zeecinemalu 1

ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటిసారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనం తో తెరకెక్కుతోన్న చిత్రం “105 మినిట్స్”. షూటింగ్ స్పాట్ లోనే ఎడిటర్ శ్యామ్ గారు పర్యవేక్షిస్తున్నారు. ”సింగిల్ షాట్” “సింగిల్ క్యారెక్టర్ ” “రీల్ టైం & రియల్ టైం ” ఈ చిత్రానికి హైలైట్స్.

hansika new stills zeecinemalu 1

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలోని ఓ విల్లాలో జరుగుతోంది. ఈ షూటింగ్ లో జాయిన్ అయిన హన్సిక పై విధంగా ట్వీట్ చేసారు.

hansika

రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో రాజు దుస్సా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సామ్ సి.యస్ సంగీతం సమకూర్చుతున్నారు. కిషోర్ బొయిదాపు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి యాక్షన్ డైరెక్టర్ మల్లి.

hansika zeecinemalu

లాంగ్ గ్యాప్ తర్వాత హన్సిక నటిస్తున్న తెలుగు సినిమా ఇది. టాలీవుడ్ లో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయడం ఆమెకు ఇష్టం లేదు. అటు కోలీవుడ్ లో కూడా అదే స్టయిల్ ఫాలో అవుతోంది. సింగిల్ క్యారెక్టర్, సింగిల్ షాట్ లో తీసే ఈ సినిమా తనకు ఓ ఛాలెంజ్ అంటోంది ఈ బబ్లీ బ్యూటీ.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics