హిరణ్యకశిప.. ఇప్పుడిది అఫీషియల్

Saturday,June 01,2019 - 04:01 by Z_CLU

రానా, గుణశేఖర్ కాంబినేషన్ లో హిరణ్యకశిప అనే సినిమా రాబోతోందనేది జస్ట్ ఓ గాసిప్ మాత్రమే. ఎట్టకేలకు ఈ సినిమాపై క్లారిటీ వచ్చింది. దర్శకుడు గుణశేఖర్ స్వయంగా ఈ సినిమాను ప్రకటించాడు. రానాతో హిరణ్యకశిప సినిమా తీయబోతున్నట్టు ఎనౌన్స్ చేశాడు గుణశేఖర్

మైథలాజికల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి మూడేళ్లుగా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందన్న గుణశేఖర్.. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ఓ విజువల్ వండర్ గా హిరణ్యకశిప సినిమా రాబోతోందని స్పష్టంచేశాడు. మూవీకి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ కంప్లీట్ అయినట్టు క్లారిటీ ఇచ్చాడు

రానాకు బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా క్రేజ్ ఉండడంతో.. ఈ ప్రాజెక్టును ఒకేసారి 3-4 భాషల్లో తెరకెక్కించాలని నిర్ణయించారు. సినిమా ఓపెనింగ్ ఎప్పుడనే అంశంతో పాటు మిగతా డీటెయిల్స్ ను త్వరలోనే వెల్లడించబోతున్నాడు గణశేఖర్.