"సాహో"కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చేది ఇతడే

Monday,June 17,2019 - 11:00 by Z_CLU

సాహో సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ భారీ చిత్రానికి స్టార్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. రన్ రాజా రన్, విశ్వరూపం, జిల్ వంటి చిత్రాలతో మ్యూజిక్ లో స్పెషల్ ట్రెండ్ సృష్టించాడు జిబ్రాన్. సాహో చాప్టర్ 2 కి, టీజర్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించింది కూడా జిబ్రానే.

రన్ రాజా రన్ వంటి సూపర్ హిట్ చిత్రం చేసినప్పుడు దర్శకుడు సుజిత్ తో వర్క్ పరంగా జిబ్రాన్ కు మంచి అనుబంధం ఏర్పడింది. సాహో భారీ ప్రాజెక్ట్ కావడంతో టాలెంటెడ్ జిబ్రాన్ ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసేందుకు ఎంపిక చేసుకున్నామని చిత్రం దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా నిలవనుంది. ప్రతీ సీన్ ని ఎలివేట్ చేసే విధంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీ రీ రికార్డింగ్ అందించనున్నాడు జిబ్రాన్.

ఇండిపెండెన్స్ డే కానుకగా అగ‌స్ట్ 15 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయ‌ర్ గా విడుద‌ల కాబోంది సాహో. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.