ఎఫ్2 బాలీవుడ్ రీమేక్ ఫిక్స్

Saturday,March 30,2019 - 12:05 by Z_CLU

నిర్మాత దిల్ రాజు బాలీవుడ్ లోకి వెళ్తాడని, త్వరలోనే ఓ హిందీ సినిమా నిర్మిస్తాడంటూ కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఆ పుకార్లు నిజమయ్యాయి. దిల్ రాజు బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఎఫ్2 సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నాడు దిల్ రాజు.

ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చిన ఈ స్టార్ ప్రొడ్యూసర్, బోనీ కపూర్ తో కలిసి ఎఫ్2ను హిందీలో రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు, ప్రాజెక్టు డైరక్టర్ ను కూడా ఫిక్స్ చేశారు. ఎఫ్2 హిందీ రీమేక్ ను అనీష్ బజ్మి హ్యాండిల్ చేయబోతున్నాడు.

ఇప్పటికే తెలుగులో ఫుల్ బిజీగా ఉన్నాడు దిల్ రాజు. 96 రీమేక్, మహర్షి సినిమాలతో పాటు మరో 3 సినిమాలు కూడా పైప్ లైన్ లో ఉన్నాయి. ఇంత బిజీగా ఉంటూనే బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు దిల్ రాజు