వరుణ్ తేజ్ సరసన ఈషా రెబ్బ...?

Monday,February 04,2019 - 10:56 by Z_CLU

త్వరలో సెట్స్ పైకి రానుంది జిగర్తాండ రీమేక్ ‘వాల్మీకి’. అయితే ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించనున్న హీరోయిన్ ఫిక్సయిందని తెలుస్తుంది. మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు కానీ, ఈషా రెబ్బ వరుణ్ తేజ్ సరసన నటిస్తుందనే న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.

రీసెంట్ గా బ్రాండ్ బాబు సినిమాలో  హీరోయిన్ గా  నటించిన ఈషా, అరవింద సమేత లో పర్ఫామెన్స్ కి కూడా అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. వచ్చిన అవకాశాల్లోంచి గుర్తుంపునివ్వగలిగే రోల్స్ ని ఎంచుకుంటూ కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్న ఈషా నిజంగానే ఈ సినిమాలో చాన్స్ కొట్టేసిందా..? లేకపోతే ఇది జస్ట్ రూమరా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇకపోతే ఈ సినిమాలో వరుణ్ తేజ్ తో పాటు మరో హీరోని కూడా ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది ‘వాల్మీకి’ టీమ్. హరీష్ శంకర్ ఈ సినిమాకి డైరెక్టర్. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్.