Pawan Bheemla Nayak - లాలా భీమ్లా సాంగ్ రిలీజ్

Sunday,November 07,2021 - 05:06 by Z_CLU

Lala Bheemla song from Bheemla Nayak launched, Trivikram’s brilliance as a lyricist shines through

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో  సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం  ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.

‘భీమ్లా నాయక్‘ చిత్రం నుంచి మరో గీతం విడుదల అయింది. ఈ చిత్రానికి సంభాషణలు, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న త్రివిక్రమ్, ఈ గీతాన్ని రచించటం విశేషం. మాటల్లో మాత్రమే కాదు పాటలో సైతం తనదైన శైలిని పలికించారన్నది స్పష్టం చేస్తుందీ గీతం.

“పది పడగల పాము పైన పాదమెట్టిన సామి తోడు…

పిడుగులొచ్చి మీద పడితే కొండగొడుగు నెత్తినోడు…”

పాటలోని ఈ పదాలు వింటే నిజమనిపించక మానదు.

‘భీమ్లా నాయక్‘ పోరాట సన్నివేశాల్లో భాగంగా ఈ గీతం కనిపిస్తుంది. తమన్ స్వరాలు, అరుణ్ కౌండిన్య గాత్రం ఆవేశాన్ని రగిలిస్తే, రెండు నిమిషాల ముప్ఫై సెకన్లు ఉన్న ఈ పాటలో కనిపిస్తున్న దృశ్యాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి.

‘భీమ్లా నాయక్‘ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్

ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC

సంగీతం: తమన్.ఎస్

ఎడిటర్:‘నవీన్ నూలి

ఆర్ట్ : ‘ఏ.ఎస్.ప్రకాష్

వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టి

పి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్

సమర్పణ: పి.డి.వి. ప్రసాద్

నిర్మాత: సూర్యదేవర నాగవంశీ

దర్శకత్వం: సాగర్ కె చంద్ర

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics