రేపే బాలకృష్ణ "జై సింహా" ఫస్ట్ లుక్

Tuesday,October 31,2017 - 10:46 by Z_CLU

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న‌ 102వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున విషయం తెలిసిందే. బాలకృష్ణ సరసన నయనతార, నాటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి “జై సింహా” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రేపు రిలీజ్ చేయబోతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. వైజాగ్ బీచ్ రోడ్ లో 5 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు, 110 బస్సులతో “మహా ధర్నా” సీక్వెన్స్ షూటింగ్ జరుగుతోంది. ఇదే షెడ్యూల్ లో బాలకృష్ణ-హరిప్రియలపై ఓ రొమాంటిక్ సాంగ్ తో పాటు, బాలయ్యపై ఓ మాంటేజ్ సాంగ్ ను షూట్ చేయనున్నారు. అరకులో కూడా కొన్ని షాట్స్ తీయబోతున్నారు.

ఇప్పటివరకూ బాలయ్య కెరీర్ లో “సింహా” అనే టైటిల్స్ తో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయినట్లుగానే.. “జై సింహా” కూడా సూపర్ హిట్ అవుతుందని యూనిట్ ఎక్స్ పెక్ట్ చేస్తోంది.ఈ చిత్రానికి కథ, మాటలు ఎం.రత్నం అందిస్తుండగా.. చిరంతన్ భట్ సంగీతం సమకూరుస్తున్నాడు.