#Baguntundi Song - హంగామా చేస్తున్న సిద్ సాంగ్!

Monday,September 27,2021 - 01:09 by Z_CLU

ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న ‘అతిథిదేవోభవ’ సినిమా నుండి మొదటి సాంగ్ రిలీజైంది. ఇటివలే ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఇంప్రెస్ చేసిన ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ కూడా మ్యూజిక్ లవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ హంగామా చేస్తుంది. ‘బాగుంటుంది’ అంటూ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన ఈ సాంగ్ ని సిద్ శ్రీరామ్ పాడాడు. ప్రస్తుతం సిద్ నుండి ఏ సాంగ్ వచ్చినా మ్యూజిక్ లవర్స్ ఎట్రాక్ట్ అవుతున్నారు. ఈ సాంగ్ కూడా ప్రెజెంట్ సోషల్ మీడియాలో హంగామా చేస్తూ ఆకట్టుకుంటుంది.

శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన రొమాంటిక్ ట్యూన్ కి అంతే రొమాంటిక్ లిరిక్స్ అందించి సాంగ్ కి మరింత అందం తీసుకొచ్చాడు భాస్కరభట్ల రవి కుమార్. ముఖ్యంగా సిద్ , నూతన మోహన్ పాడిన తీరు కూడా బాగుంది. ఓవరాల్ గా బాగుంటుంది అంటూ మ్యూజిక్ లవర్స్ ముందుకు వచ్చిన ఈ సాంగ్ మంచి వ్యూస్ తో ముందుకు వెళ్తోంది. సిద్ పాడిన అన్ని పాటల్లాగే ఇది కూడా తక్కువ టైంలోనే ఈ సాంగ్ మిలియన్ వ్యూస్ కొల్లగొట్టడం ఖాయమనిపిస్తుంది.

శ్రీనివాస సినీ క్రియేషన్స్ బేనర్ పై రాజబాబు మిర్యాల , అశోక్ రెడ్డి మిర్యాల నిర్మిస్తున్న ఈ సినిమాతో పొలిమేర నాగేశ్వరరావు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆది సాయి కుమార్ సరసన నివేక్ష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయబోతున్నారు మేకర్స్.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics