డబ్బింగ్ చెప్పకపోవడానికి రీజన్ అదే - అనుపమ

Sunday,October 21,2018 - 02:40 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకెళ్తున్న మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కన్నడ పరిశ్రమకు కూడా పరిచయం అవుతుంది. ఇప్పటికే మలయాళం, తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ ‘నట సార్వభౌమ’ సినిమాతో కన్నడ ప్రేక్షకులకు పరిచయం అవ్వడానికి రెడీ అయింది. ఈ సినిమాకు సంబంధించి ఇటివలే తన పార్ట్ షూట్ ఫినిష్ చేసిన అనుపమ ఈ సినిమాలో తన క్యారెక్టర్ కి సొంత డబ్బింగ్ చెప్పడానికి మాత్రం  నో చెప్పేసిందట.

‘తేజ్’ మినహా తెలుగులో ఇప్పటి వరకూ తను నటించిన అన్ని సినిమాలకు సొంత డబ్బింగ్ చెప్పుకున్న ఈ బ్యూటీ కన్నడ రానందు వల్లే డబ్బింగ్ కి నో అందట. అయితే తేజ్ సినిమా టైంలో కాస్త బిజీ గా ఉండటం వల్లే డబ్బింగ్ చెప్పుకోలేకపోయానని తెలిపింది.