Anand Deverakonda - యంగ్ హీరో నుంచి మరో సినిమా

Friday,May 07,2021 - 01:48 by Z_CLU

కేవీ గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా  శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ వెంక‌ట్ త‌లారి కొత్త చిత్రం `హైవే` ప్రారంభం.

ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేసిన కేవీ గుహ‌న్ `118`చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారి మొద‌టి సినిమాతోనే సూప‌ర్‌హిట్ సాధించారు. ప్ర‌స్తుతం కేవీ గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం `హైవే`. (ఏ న‌ర్వ్ వ్రాకింగ్ రైడ్ స్టోరి). రోడ్ జ‌ర్నీ నేప‌థ్యంలో సైకో కిల్ల‌ర్-క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి వెంక‌ట్ త‌లారి నిర్మాత‌.  ఈ చిత్రం హైద‌రాబాద్ సంస్థ కార్యాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభమైంది. సైమ‌న్ కె.కింగ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్‌షూటింగ్ జూన్ ఫ‌స్ట్ వీక్ నుండి ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్భంగా…

హైవే నేప‌థ్యంలో ఒక సైకో క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీగా వస్తోంది ఈ సినిమా. .

ద‌ర్శ‌కుడిగా విభిన్న‌చిత్రాలు అందిస్తున్న కేవీ గుహ‌న్ మాట్లాడుతూ – “ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా నేను డైరెక్ట్ చేస్తోన్న`హైవే` మూవీ పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభంకావ‌డం సంతోషంగా ఉంది. ప్రీ ప్రొడ‌క్ష‌న్ దాదాపుగా పూర్త‌య్యింది. ఆర్టిస్టుల‌, టెక్నీషియ‌న్స్ సెల‌క్ష‌న్ జ‌రుగుతోంది. జూన్ ఫ‌స్ట్ వీక్ నుండి  రెగ్యుల‌ర్ షూటింగ్ ప్లాన్ చేశాం. త్వ‌ర‌లో మ‌రికొంత మంది ఫేమ‌స్‌ ఆర్టిస్టుల‌తో మిమ్మ‌ల్ని స‌ర్‌ప్రైజ్ చేస్తాం“ అన్నారు.

Anand Devarakonda Highway movie Launch zeecinemalu 1

క్రేజీ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ త‌మ్ముడు, రీసెంట్‌గా మిడిల్‌క్లాస్ మెలోడీస్ చిత్రంతో అంద‌రికీ ఆక‌ట్టుకున్న హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ – “నేను ఫ‌స్ట్ టైమ్ ఒక ఎక్స్‌పీరియ‌న్స్‌డ్ డైరెక్ట‌ర్‌తో వ‌ర్క్ చేస్తున్నాను. గుహ‌న్ గారు సూప‌ర్ కెమెరామేన్‌. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో  శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ లో సినిమా చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. ఈ జ‌ర్నీలో నేను చాలా కొత్త విష‌యాలు నేర్చుకుంటాన‌నే న‌మ్మ‌కం ఉంది. త‌ప్ప‌కుండా ఒక గ్రేట్ మూవీ అవుతుంది. ఇక్క‌డికి వ‌చ్చిన ఎంఎల్ఎ గాద‌రి కిశోర్‌కుమార్ మ‌రియు నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన గుహ‌న్ గారికి, వెంక‌ట్ త‌లారి గారికి, ర‌మేష్‌గారికి ద‌న్య‌వాధాలు“ అన్నారు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics