Allu Sirish - డేటింగ్ చేశాను.. బ్రేకప్ కూడా అయింది

Thursday,October 20,2022 - 01:01 by Z_CLU

Allu Sirish Reveals his relationships and BreakUps

హీరోలు తమ వ్యక్తిగత విషయాల్ని బయటకు చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. అయితే అందరు హీరోలు అలా ఉండరు. ఈ విషయంలో అల్లు శిరీష్ చాలా స్ట్రయిట్ గా ఉన్నాడు. తన డేటింగ్ మేటర్స్ బయటపెట్టాడు. అంతేకాదు, తనకు 2-3 రిలేషన్ షిప్స్ ఉన్నాయని కూడా తెలిపాడు. అతడి మాటల్లోనే..

 ఈ కాలం రిలేషన్ షిప్ లేకుండా ఎవ్వరూ ఉండరు. నేను కూడా డేటింగ్ చేశాను. బ్రేకప్ చెప్పిన తర్వాత అమ్మాయికే కాదు, అబ్బాయికి కూడా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఒకసారి కాదు, చాలాసార్లు నేను ఎక్స్ పీరియన్స్ చేశాను. గతంలో నాకు 2-3 సీరియస్ రిలేషన్ షిప్స్ ఉండేవి. అవన్నీ బ్రేకప్ అయ్యాయి.

 ఓ మంచి కుటుంబానికి చెందిన అమ్మాయితో చాన్నాళ్లు డేటింగ్ చేశాను. కానీ నేనే బ్రేకప్ చెప్పాను. తనతో పాటు నేను కూడా బాధపడ్డాను. నేను తీసుకున్న బ్రేకప్ నిర్ణయం కరెక్టా కాదా అని 3-4 నెలలు అనిపించింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆరోజు నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది.

– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics