Allari Naresh 'ఉగ్రం' మూవీ మొదలైంది

Monday,August 22,2022 - 03:06 by Z_CLU

Allari Naresh’s ‘Ugram’ Launched today

అల్లరి నరేష్ , విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వచ్చిన ‘నాంది’ సినిమా సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కాంబోలో మరో సినిమా వస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో రెండో సినిమాగా వస్తున్న ఈ సినిమాకు ‘ఉగ్రం’ అనే టైటిల్ పెట్టుకున్నారు. ఈరోజే సినిమాను పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టారు. రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన ఈ సినిమా ఓపెనింగ్ అనిల్ రావిపూడి , దిల్ రాజు , దాము ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అయితే తమ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ‘నాంది’ కి సీక్వెల్ కాదని , కాని నాందిలో నరేష్ కేరెక్టర్ కి ఉగ్రం ఉంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారని ,  యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించనున్నట్లు దర్శకుడు విజయ్ తెలిపాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల నుండి షూటింగ్ జరుపుకోనుంది.

షైన్ స్క్రీన్స్ బేనర్ పై సాహు గారపాటి , హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకు టూమ్ వెంకట్ కథ అందిస్తుండగా , శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే కాస్టింగ్ డీటెయిల్స్ చెప్పనున్నారు మేకర్స్.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics