Alia Bhatt RRR - షూటింగ్స్ కు రెడీ అయిన ముద్దుగుమ్మ

Monday,June 14,2021 - 01:31 by Z_CLU

కరోనా నుంచి కోలుకున్న అలియా భట్, ఆ తర్వాత లాక్ డౌన్ వల్ల పూర్తిగా ఇంటికే పరిమితమైంది. అలా కావాల్సినంత విశ్రాంతి తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు షూటింగ్స్ కు రెడీ అవుతోంది. ముందుగాసంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను పూర్తిచేయాలని నిర్ణయించుకుంది. భన్సాలీ దర్శకత్వంలో గంగూబాయ్ కథియావాడీ అనే సినిమా చేస్తోంది అలియాభట్. ఈ సినిమాకు సంబంధించి కేవలం ఒక రోజు షూట్ బ్యాలెన్స్ ఉంది. అది కూడా సాంగ్ షూటింగ్.

alia bhatt as Sita in RRR

RRRలో అలియా భట్

ముంబయిలో రేపట్నుంచి సినిమా షూటింగ్స్ కు పర్మిషన్స్ ఇచ్చారు. దీంతో ఈ ఒక్క సాంగ్ షూట్ కోసం భన్సాలీ ఏర్పాట్లు చేస్తున్నాడు. దాదాపు 100 మంది డాన్సర్లతో చేయాలనుకున్న ఈ సాంగ్ ను, కేవలం 30 మంది డాన్సర్లతో పూర్తిచేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ 30 మంది డాన్సర్లు కూడా కరోనా టీకా
తీసుకున్నారు.

ఇక ఈ షూట్ కంప్లీట్ అయిన వెంటనే బ్రహ్మాస్త్ర సినిమాపై దృష్టిపెట్టబోతోంది అలియా. ప్రియుడు రణబీర్ కపూర్ తో కలిసి ఈ సినిమాలో నటిస్తోంది అలియా భట్. ఈ సినిమా షూటింగ్ ను ఈ నెలాఖరు నుంచి ప్రారంభించాలనుకుంటున్నారు. దీనికోసం ముంబయిలోనే సెట్ వేస్తున్నారు. ఇందులో టాలీవుడ్ హీరో
నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

గంగూబాయ్, బ్రహ్మాస్త్ర సినిమాలు పూర్తయిన తర్వాత RRR Movie సెట్స్ పైకి రాబోతోంది అలియా భట్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో సీత పాత్రలో ఆమె కనిపించబోతోంది. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే మెల్లగా షూటింగ్స్ మొదలుపెడుతున్నారు. అయితే RRR ఎప్పట్నుంచి సెట్స్ పైకి వస్తుందనేది ఇంకా క్లారిటీ రాలేదు.

ఈ సినిమాకు సంబంధించి అలియా భట్ తో మరో షెడ్యూల్ ఉంటుందని రాజమౌళి ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. కానీ అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చేనెల నుంచి RRR Movie సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ షెడ్యూల్ తో అలియాభట్ కు సంబంధించిన పోర్షన్ మొత్తం కంప్లీట్ చేయబోతున్నాడు రాజమౌళి. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తుంది యూనిట్.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics