#AVPL Remake: బాలీవుడ్ లిస్ట్ రెడీ

Thursday,July 30,2020 - 03:19 by Z_CLU

హీరో: కార్తీక్ ఆర్యన్
డైరక్టర్: రోహిత్ ధావన్
బ్యానర్: బాలాజీ టెలిఫిలిమ్స్, హారిక-హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్
టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన అల వైకుంఠపురములో సినిమాకు రీమేక్ రెడీ అవుతోంది. మొన్నటివరకు డిస్కషన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చింది.

బాలాజీ టెలీఫిలిమ్స్ బ్యానర్ పై ఏక్తాకపూర్ నిర్మాతగా ఈ సినిమా హిందీలో రీమేక్ కాబోతోంది. రాధాకృష్ణ, అల్లు అరవింద్ సహ-నిర్మాతలుగా వ్యవహరిస్తారు.

తెలుగులో అల్లు అర్జున్ నటించిన పాత్రకు హిందీలో కార్తీక్ ఆర్యన్ ను తీసుకున్నారు. హీరో వరుణ్ ధావన్ తమ్ముడు రోహిత్ థావన్ ఈ సినిమాను డైరక్ట్ చేయబోతున్నాడు.

మ్యూజిక్ డైరక్టర్ తో పాటు మిగతా నటీనటుల ఎంపిక ఇంకా స్టార్ట్ అవ్వలేదు.