

Sunday,September 05,2021 - 01:41 by Z_CLU
ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎలాంటి కట్స్ చెప్పకుండా సెన్సార్ వారు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో కేతికా శర్మను ఆకాష్ వెనక నుండి కౌగిలించుకోవడం చూడొచ్చు. ఇది సినిమా టైటిల్‌ను జస్టిఫై చేస్తుంది. త్వరలో ఈ మూవీని థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు మేకర్స్.
రమ్యకృష్ట ఒక కీలకపాత్రలో నటించారు. ఇంటెన్స్ రొమింటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సునిల్ కశ్యప్ సంగీతం అందించారు. నరేష్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.
ఇప్పటికే విడుదలైన పాటలకు విశేష స్పందన వచ్చింది. దాంతో పాటు ఇప్పటి వరకు రిలీజైన అన్ని పోస్టర్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సినిమాపై మంచి బజ్‌ని క్రియేట్ చేశాయి.
తారాగణం:
ఆకాశ్ పూరి, కేతికా శర్మ, రమ్యకృష్ట, మకరంద్ దేశ్‌పాండే, ఉత్తేజ్, సునైన
సాంకేతిక వర్గం:
కథ,స్క్రీన్‌ప్లే,డైలాగ్స్: పూరిజగన్నాధ్
దర్శకత్వం: అనిల్ పాదూరి
నిర్మాతలు: పూరిజగన్నాధ్, ఛార్మీ కౌర్
సమర్పణ: లావణ్య
బేనర్స్: పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరి కనెక్ట్స్
సంగీతం: సునిల్ కశ్యప్
సినిమాటోగ్రఫి: నరేష్
ఎడిటర్: జునైద్ సిద్దిఖీ
ఆర్ట్: జానీ షేక్
లిరిక్స్: భాస్కరభట్ల
ఫైట్స్: `రియల్` సతీష్
పిఆర్ఓ: వంశీ – శేఖర్
Thursday,August 24,2023 07:36 by Z_CLU
Tuesday,August 22,2023 12:43 by Z_CLU
Friday,August 18,2023 03:55 by Z_CLU
Friday,August 18,2023 10:06 by Z_CLU