సంక్రాంతి సినిమాల సందడి రేపటి నుండే

Tuesday,January 10,2023 - 04:56 by Z_CLU

2023 Sankranthi Movies getting ready to entertain audience

ప్రతీ ఏడాది లాగే ఈ ఇయర్ కూడా సంక్రాంతి సీజన్ లో బడా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి. రేపటి నుండే సంక్రాంతి సినిమాల సందడి మొదలు కానుంది. జనవరి 11న అంటే రేపు అజిత్ తెగింపు Thegimpu ( డబ్బింగ్) రిలీజవుతుంది. ఎల్లుండి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ Veerasimhareddy థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే సినిమాకు సంబందించి సెన్సార్ కూడా పూర్తయింది. జనవరి 12న బాలయ్య పవర్ ఫుల్ వీర సింహా రెడ్డిగా చూసేందుకు తెలుగు ప్రేక్షకులు రెడీ అవుతున్నారు.

ఇక జనవరి 13 న బాలయ్య సినిమా థియేటర్స్ లోకి వచ్చిన మరునాడు చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ Waltair Veerayya ప్రేక్షకుల ముందుకు రానుంది. బాబీ డైరెక్షన్ లో చిరు , రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి అన్నీ పనులు పూర్తయ్యాయి. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత విజయ్ ‘వారసుడు’ Varasudu (డబ్బింగ్) సంక్రాంతి స్పెషల్ గా జనవరి 14 న విడుదలవుతుంది. అదే రోజు సంతోష్ శోభన్ హీరోగా అనిల్ దర్శకుడిగా పరిచయం అవుతూ యూవీ క్రియేషన్స్ నిర్మించిన ‘కళ్యాణం కమనీయం’ సినిమా రాబోతుంది.

ఇక తెలుగు వారికి సంక్రాంతి పండుగ అంటే ఆ సందడిలో సినిమా చూడటం కూడా ఓ అలవాటు. రేపటి నుండి థియేటర్స్ లో ప్రేక్షకులతో సంక్రాంతి సినిమాల సందడి మొదలు కానుంది. 2023 సంక్రాంతి సినిమాలన్నీ ఘన విజయం సాదించాలని ఆశిస్తోంది జీ సినిమాలు.