అక్షరాలా వెయ్యి కోట్లు.. చరిత్ర సృష్టించిన 2.O

Sunday,December 23,2018 - 12:16 by Z_CLU

రజనీకాంత్, శంకర్ కాంబోలో తెరకెక్కిన 2.O సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది. రీసెంట్ గా 25 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ మూవీ వరల్డ్ వైడ్ వెయ్యి కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. ఈ మేరకు లైకా ప్రొడక్షన్స్ నుంచి త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతోంది. రజనీకాంత్ కెరీర్ లోనే కాదు, ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టిన అతి తక్కువ సినిమాల జాబితాలోకి ఇప్పుడు 2.O కూడా చేరింది.

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది 2.O మూవీ. దాదాపు రెండేళ్ల పాటు ఎంతో కష్టపడి ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు. దీని కోసం ప్రత్యేకంగా రియల్ త్రీడీ కెమెరాలు వాడారు. హాలీవుడ్ లో ఆస్కార్ అవార్డులు పొందిన సినిమాలకు వర్క్ చేసిన వరల్డ్ బెస్ట్ టెక్నీషియన్లు 2.O కోసం వర్క్ చేశారు. వాళ్లందరి శ్రమకు ఇప్పుడు తగిన గుర్తింపు లభించింది.

విడుదలై 25 రోజులు గడిచినప్పటికీ ఇప్పటికీ క్రిస్మస్ కు బాక్సాఫీస్ లో ఇదే బెస్ట్ ఆప్షన్ గా నిలిచింది. అంతేకాదు, రాబోయే సంక్రాంతి సీజన్ లో కూడా 2.O హాట్ ఫేవరెట్ గా నిలవబోతోంది. అటు క్రిస్మస్ హాలిడేస్ కారణంగా ఓవర్సీస్ లో ఈ సినిమాకు రెట్టింపు లాభాలు వచ్చే అవకాశం ఉంది. యూఎస్ లో ఈ సినిమాకు ఇప్పటికే 6 మిలియన్ డాలర్ వసూళ్లు వచ్చాయి.