ZEE5 'హలో వరల్డ్' రివ్యూ

Tuesday,August 16,2022 - 08:18 by Z_CLU

నటీ నటులు : ఆర్యన్ రాజేష్ , సదా , రామ్ నితిన్ , నయన్ కరిష్మ , సుదర్శన్ గోవింద్ , నితిన్ శెట్టి , నిఖిల్ వీ సింహ , అపూర్వ రావు ,అనీల్ గీలా,స్నేహాల్ , రవి వర్మ , జయప్రకాశ్ , సంజయ్ స్వరూప్, కోటేశ్వరరావు , మిర్చి కిరణ్ తదితరులు

కెమెరా : రాజు

సంగీతం : పీకే దండి

ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి

నిర్మాణం : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్

నిర్మాత : నిహారిక కొణిదెల

రచన – దర్శకత్వం : శివ సాయి వర్ధన్

విడుదల తేది : 12 ఆగస్ట్ 2022

ఎపిసోడ్స్ : 8

కథ :

బీ టెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న సిద్దార్థ్ (రామ్ నితిన్), మేఘన (నయన్ కరిష్మ) , వరుణ్ (సుదర్శన్ గోవింద్), ప్రవలిక(నిత్యా శెట్టి),  రాహుల్ (నిఖిల్ సింహ), వర్ష (అపూర్వ రావు) , సురేష్ (అనీల్ గీల) కి పీపుల్ టెక్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు వస్తాయి. తమ ఇంటి నుండి ఉద్యోగరీత్య హైదరాబాద్ బయలుదేరి ఆఫీస్ లో జాయిన్ అవుతారు.  ఒకరి గురించి ఒకరు తెలుసుకొని మంచి స్నేహితులవుతారు. ఆఫీస్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు.

పీపుల్ టెక్ కంపనీ ఆరు నెలల పాటు వీళ్ళందరినీ టెంపరరీ ఎంప్లాయిస్ గా తీసుకొని ట్రైనింగ్ ఇస్తారు. మరి ఆరు నెలల తర్వాత వీళ్ళ ఉద్యోగాలు పర్మినెంట్ అయ్యాయా ? ఫైనల్ గా సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో వీళ్ళు ఎలా విజయం సాధించారు అనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

సిద్దార్థ్ పాత్రలో రామ్ నితిన్, మేఘన  పాత్రలో నయన్ కరిష్మ , వరుణ్ పాత్రలో సుదర్శన్ గోవింద్, ప్రవలిక పాత్రలో నిత్యా శెట్టి,  రాహుల్ పాత్రలో నిఖిల్ సింహ, వర్ష  పాత్రలో అపూర్వ రావు , సురేష్ పాత్రలో అనిల్ గీల, అమృత పాత్రలో స్నేహళ్ కామత్ బాగా నటించారు. ఇచ్చిన పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. ఈ సిరీస్ తర్వాత వీళ్ళందరూ నటులుగా బిజీ అవ్వడం ఖాయమనిపించింది. ముఖ్యంగా కేరెక్టర్స్ డిజైనింగ్ బాగా కుదరడంతో  తమ పెర్ఫార్మెన్స్ తో మెప్పించి సిరీస్ కి బ్రేక్ ఇవ్వకుండా చూడాలనిపించేలా చేశారు.

రాఘవ్ పాత్రలో ఆర్యన్ రాజేష్ , ప్రార్ధన పాత్రలో సదా మెప్పించారు. చాన్నాళ్ళకి మంచి పాత్రలు దక్కడంతో యాక్టర్స్ గా బెస్ట్ ఇచ్చారు. జయప్రకాశ్ , రవి వర్మ ఎప్పటిలానే తమ నటనతో మంచి మార్కులు అందుకున్నారు. మిగతా నటీ నటులంతా వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

వెబ్ సిరీస్ లకు టెక్నికల్ సపోర్ట్ అందితే ఇంకో లెవెల్ కి వెళ్తుంది. హలో వరల్డ్ కి సంబంధించి విజువల్స్ , ఎడిటింగ్ , మ్యూజిక్ ఇలా అన్ని విభాగాల నుండి మంచి అవుట్ పుట్ అందింది. ముఖ్యంగా రాజు కెమెరా వర్క్ ఇంప్రెస్ చేసింది. పీకే దండి మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ తో పాటు సన్నివేశాలకు తగ్గట్టుగా వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ సిరీస్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఎక్కడా బోర్ కొట్టకుండా ఎడిట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. సాంగ్స్ కి శ్రీమణి అందించిన ట్రెండీ లిరిక్స్  బాగున్నాయి.

కాస్ట్యూమ్స్ , మేకప్ అన్నీ బాగా కుదిరాయి. దర్శకుడు శివ సాయి వర్ధన్ కథ -కథనం -సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే అండ్ టేకింగ్ చాలా బాగుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ప్రొడక్షన్ వేల్యూస్ సిరీస్ క్వాలిటీని పెంచాయి.

జీ సినిమాలు సమీక్ష :

IT Calling...  మొదటి ఎపిసోడ్ లో దర్శకుడు కేరెక్టర్స్ ఇంట్రడక్షన్ , వారి ఇబ్బందులు, ఆఫీసులో జాయిన్ అయిన వెంటనే వారి మధ్య పుట్టే ఫ్రెండ్షిప్ , ఒకరితో ఒకరికి ఉండే బాండింగ్ ను చాలా అందంగా చూపిస్తూ మెప్పించాడు. ముఖ్యంగా కేరెక్టర్స్ బిహేవియర్ ని మొదటి ఎపిసోడ్ లోనే నీట్ గా చూపించేసి పాత్రల పేర్లు రిజిస్టర్ అయ్యేలా చేశాడు. బీటెక్ కంప్లీట్ చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యే యువత సంతోషం , జాయిన్ అయిన వెంటనే వారి ఇబ్బందులను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అలాగే తమ పిల్లలకు ఉద్యోగం వస్తే తల్లిదండ్రుల పట్టరాని సంతోషాన్ని కూడా చక్కగా చూపించాడు.  సాఫ్ట్ వేర్ ఆఫీస్ ఎలా ఉంటుంది ? జాయినింగ్ ప్రాసెస్ ఏంటి ? ఇలా వీటన్నిటినీ IT Calling Episode లో డిటైలింగ్ గా చూపించాడు దర్శకుడు. అలాగే పీపుల్ టెక్ ప్రాజెక్ట్ వర్క్ లో ఉన్న ఓ సమస్య ను లైట్ గా టచ్ చేసి మిగతా ఎపిసోడ్స్ లో ఆ ప్రాజెక్ట్ వర్క్ గురించి ఇంకా క్లియర్ గా చెప్పనున్నట్లు హింట్ ఇచ్చారు.

Oops, life sucks Again  రెండో ఎపిసోడ్ లో సాఫ్ట్ వేర్ ఆఫీసులో ఫ్రెషర్స్ కి ఉండే రూల్స్ , అక్కడ వర్క్ ప్రాసెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు దర్శకుడు. అసలు సాఫ్ట్ వేర్ జాబ్ లో జాయిన్ అవ్వగానే టీచింగ్ క్లాసెస్ ఎలా తీసుకుంటారు ? ఫ్రెషర్స్ కి అందరూ సపోర్ట్ చేస్తారా ? లాంటి విషయాలను నేచురల్ సీన్స్ తో చెప్పాడు దర్శకుడు. అలాగే ఈ ఎపిసోడ్ లో సదా , ఆర్యన్ రాజేష్ పాత్రలను పరిచయం చేసి కథలో ఆ కేరెక్టర్స్ ఇంపార్టెన్స్ తెలియజేశాడు.   ఈ ఎపిసోడ్ లో ఒకరి మీద ఒకరికి బాండింగ్ బిల్డ్ చేస్తూ వచ్చే సీన్స్ ఆకట్టుకున్నాయి. కాంటీన్ లో అందరూ కలిసి ఫుడ్ తినే సీన్ , రాఘవ క్లాస్ తీసుకొనే సీన్ , మేఘన పెళ్లి మానుకొని జాబ్ లో జాయిన్ అయ్యే సీన్ హైలైట్ గా నిలిచాయి.

Salary Credited ఏ ఉద్యోగి అయినా  మొదటి సాలరీ అందుకునే తరుణం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తాడు. సాలరీ పడిందని మెసేజ్ చూసుకోగానే ఆ సంతోషానికి అవదలుండవు.  అది మాటల్లో చెప్పలేని ఓ చక్కని అనుభూతి. ఈ ఎపిసోడ్ లో ఆ ఎమోషన్ చూపించి వారు పొందే అనుభూతి, పార్టీ మూడ్ తో ఈ ఎపిసోడ్ ని ఎంజాయబుల్ గా తీర్చి దిద్దాడు డైరెక్టర్. ప్రవళిక, వరుణ్ ట్రాక్ , మొదటి సాలరీ తల్లిదండ్రులకు పంపి సర్ప్రయిజ్ చేసిన సురేష్ , మిగతా వారు వారి పేరెంట్స్ కి గిఫ్ట్స్ పంపడం, అందరూ కలిసి అనాధ పిల్లలకు ఫుడ్ డొనేషన్ చేయడం ఇలా ఎపిసోడ్ అంతా ఫన్, ఎమోషన్ తో మిక్స్ చేసిన దర్శకుడు  ఒక చిన్న ట్విస్ట్ తో ఎండ్ చేశాడు. అందరూ కలిసి చిన్న తప్పు చేసి దొరికిపోయి ఉద్యోగాలు పోయే స్టేజి వరకూ తెచ్చుకోవడంతో అసలు వీళ్ళ ఉద్యోగాలు ఉన్నాయా ? పోయాయా అనే క్యూరియాసిటీ కలిగి  వెంటనే నెక్స్ట్ ఎపిసోడ్ ని స్కిప్ చేయకుండా చూసేలా చేస్తుంది.

Break Point తప్పు చేసి HR  ముందు నిలబడి జాబ్స్ పోగొట్టుకునే స్టేజి నుండి వీళ్ళంతా బయటపడే సీన్ తో ఎపిసోడ్ ను స్టార్ట్ చేశాడు దర్శకుడు. ఈ ఎపిసోడ్ లో సదా క్లాస్ తీసుకుంటూ ట్రైనీస్ కి క్లియర్ గా అర్థమయ్యే విధంగా కంటెంట్ ఎక్స్ ప్లేన్ చేసే సీన్ , సిద్దార్థ్ -మేఘన మధ్య వచ్చే లవ్ ట్రాక్ , క్యాంపస్ లో ఫ్లాష్ మొబ్ టైపులో డాన్స్ పెర్ఫార్మెన్స్ ,  వరుణ్ మీద తనకున్న లవ్ ని అతని ఫ్రెండ్స్ తో ప్రవళిక షేర్ చేసుకునే సీన్ ఆ వెంటనే వరుణ్ ఇంకో అమ్మాయి తో రొమాన్స్ చేసే సీన్స్ హైలైట్ గా నిలిచాయి. అలాగే ఇదే ఎపిసోడ్ లో రాహుల్ , వర్ష ల లవ్ స్టోరీ వర్ష పేరెంట్స్ కి విషయం తెలిసిపోయే సీన్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక సురేష్ ట్రైనింగ్ ఎగ్జాం తర్వాత సూసైడ్ చేసుకోవాలనుకోవడం , టెన్షన్ తో  సిద్దార్థ్ , వరుణ్ , రాహుల్ లు సురేష్ ని వెతకడం చివరికి సురేష్ కి ఏమిజరగలేదని తెలుసుకుని అందరూ ఊపిరి పీల్చుకునే  సీన్ తో ఎపిసోడ్ ఎండవుతుంది. ఫస్ట్ ఎగ్జాంలో కొందరి ఫెయిల్యూర్, రిజల్ట్ తర్వాత ఆఫీస్ లో ఏం జరుగనుంది అనే ఆసక్తి నెలకొల్పేలా ఈ ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్ గా సాగింది.

New Beginnings ట్రైనింగ్ క్లాసెస్ కంప్లీట్ చేసుకొని ప్రాజెక్ట్ లోకి ఎంటరయ్యే సన్నివేశాలతో ఈ ఎపిసోడ్ అంతా వర్క్ గురించే సాగుతుంది. ప్రాజెక్ట్ వర్క్స్ తో బిగిన్ అయిన ఎపిసోడ్ లో ఫ్రెండ్స్ అంతా కలిసి వర్క్ గురించి దాని వల్ల కలిగే ఇబ్బందుల గురించి మాట్లాడుకోవడం , వర్ష కి వాళ్ళింట్లో  మ్యాచ్ చూసి ఓకె చేయమని చెప్పడం , తర్వాత అందరూ వర్క్ ప్రెజర్ లో పడిపోవడం, ఫైనల్ గా సురేష్ ఇచ్చిన ప్రింట్స్ దెబాషిశ్ మనిషి తీసుకొని సురేష్ ని బ్లేమ్ చేసి రాఘవ మీద ఓ చెడ్డ మార్క్ వేయడంతో ఎపిసోడ్ ని ఎండ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో సాఫ్ట్ వేర్ కష్టాలు , లోలోపల జరిగే మీటింగ్స్ , వర్క్ చేసే వాళ్లకి అడ్డు తగిలేలా చేసే పాలిటిక్స్ ఇలా అన్ని విషయాలను క్లియర్ గా ఎక్స్ ప్లేన్ చేస్తూ చూపించారు. ఈ ఎపిసోడ్  సాఫ్ట్ వేర్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంది. మిగతా వారిని కూడా మెప్పిస్తుంది.

Life Is Scrum వర్ష కోసం రాహుల్ ప్రాజెక్ట్ వదులుకోవడంతో ఎపిసోడ్ మొదలవుతుంది. ఫస్ట్ ఎగ్జాం ఫెయిల్ అయిన కొందరు సెకండ్ ఎగ్జాం పాస్ అవ్వాలని కాస్త ప్రెజర్ తీసుకోవడం , మేఘన తనకున్న సమస్యను సిద్దార్థ్ తో షేర్ చేసుకోవడం , వరుణ్ లవ్ అనుకున్న దాన్ని రిచా లస్ట్ అని చెప్పే సీన్ ,  ప్రవళిక వరుణ్ కి ప్రపోజ్ చేస్తూ వచ్చే ఎమోషనల్ సీన్ … సిద్దార్థ్ , మేఘన , వరుణ్ , ప్రవళిక, అమృత , సురేష్ ఆరుగురితో రాఘవ్  ఒక టీం ఫాం చేసి వాళ్ళను ట్రైన్ చేస్తూ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేసే సీన్స్ , తర్వాత వచ్చే  పార్టీ సీన్ , వరుణ్ తన  ఫ్యామిలీతో కన్వర్సేషణ్ సీన్ ఎపిసోడ్ లో హైలైట్స్ అని చెప్పొచ్చు. ఫైనల్ గా వర్ష కి వేరొకరితో ఎంగేజ్మెంట్ అయిందని తెలిసి రాహుల్ కుప్పకూలిపోయే సన్నివేశంతో ఎమోషనల్ టచ్ తో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.

Error 404 రాహుల్ ఐడియా నచ్చి ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చిన ఓ కంపెనీ మీటింగ్ తో ఎపిసోడ్ మొదలవుతుంది. ఆ వెంటనే వర్ష దగ్గరికి రాహుల్ బయలుదేరే సీన్ , ఫ్రెండ్స్ రాహుల్ ని ఆపే సీన్ , వర్ష తనని మోసం చేసిందని రాహుల్ తెలుసుకోవడం హైలైట్ గా నిలిచాయి. ఆ సందర్భంలో సిద్దార్థ్ , వరుణ్ , మేఘన , సురేష్ , అమృత రాహుల్ ని కింద పడకుండా పట్టుకొని తిరిగి మళ్ళీ పైకి లేపే షాట్ వాళ్ళ ఫ్రెండ్షిప్ ని హైలైట్ చేస్తూ ఆకట్టుకుంది. అలాగే రాఘవ్ రామ సేతు టీం ని ప్రాజెక్ట్ నుండి తప్పించడం , ప్రార్ధన కీరితి తో లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటూ మోస పోవడం సీన్స్ ఎమోషనల్ గా వర్కౌట్ అయ్యాయి. అలాగే వర్ష వల్ల మనసు గాయపడిన రాహుల్ ని ప్రార్దన తన ఇంట్లో పెట్టుకొని  అతన్ని మార్చాలని చూసే సీన్స్ బాగున్నాయి.  రాఘవ్ ని బెదిరించి దెబాషిశ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకుండా పాలిటిక్స్ ప్లే చేసే సీన్ బాగుంది. అసలు విషయాన్ని తెలుసుకొని, రాఘవ్ తమని ప్రాజెక్ట్ నుండి ఎందుకు వెళ్ళమన్నారో అర్థం చేసుకొని సిద్దార్థ్ , వరుణ్ , మేఘన , అమృత , సురేష్ , రాహుల్ కలిసి రాఘవ్ దగ్గరికి వెళ్లేసరికి అతను హార్ట్ ఎటాక్ తో కిందపడటం ,  అందరూ కలిసి రాఘవ్ ని హాస్పిటల్ కి షిఫ్ట్ చేసే సీన్ తో ఎపిసోడ్ ముగుస్తుంది. అలాగే ఈ ఎపిసోడ్ లో సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్ తమ ఫ్యామిలీ ని పక్కన పెట్టి , సరైన టైం కి తినక ఆరోగ్యాన్ని దెబ్బ తీసుకోవడాన్ని చాలా రియలిస్టిక్ గా చూపించి వాళ్ళ పనితీరు అద్దం పట్టేలా చూపించాడు దర్శకుడు.

Exception Handling రాఘవ్ ని హాస్పిటల్ లో జాయిన్ చేసి చెయిర్స్ లో కూర్చొని సిద్దార్థ్ తమకి దైర్యం చెప్పి ముందడుగు వేయించిన వ్యక్తి ఇప్పుడు లైఫ్ అండ్ డెత్ అనే స్టేజిలో ఉన్నాడు అంటూ వాయిస్ ఓవర్ తో చివరి ఎపిసోడ్ స్టార్టవుతుంది. ఆ తర్వాత రాఘవ్ టేకాఫ్ చేసిన ప్రాజెక్ట్ ని మళ్ళీ సిద్దార్థ్ తన ఫ్రెండ్స్ తో లీడ్ చేసేందుకు ట్రై చేసే సీన్స్ , వారికి ప్రార్థన సపోర్ట్ చేసే సీన్స్ ఆకట్టుకున్నాయి.  సిద్దార్థ్ అండ్ టీం కలిసి రాఘవ్ ప్రాజెక్ట్ ని ఎలా కంప్లీట్ చేయగలిగారు , ఫైనల్ గా తమ టాలెంట్ నిరూపించుకొని ఎలా బెస్ట్ ఎంప్లాయీస్  అనిపించుకున్నారనేది చూపిస్తూ ఈ కథకి మంచి ఫినిషింగ్ ఇచ్చాడు దర్శకుడు. ఇక రాఘవ్ భార్య కేరెక్టర్ తో సాఫ్ట్ వేర్ జాబ్ చేసే వారి భార్యల బాధను చూపిస్తూ సాఫ్ట్ వేర్స్ కి ఉద్యోగమే కాకుండా తమ కుటుంబాన్ని కూడా చూసుకుంటూ వారితో గడపాలని ఓ చిన్నపాటి సందేశం అందించాడు దర్శకుడు శివ సాయి వర్ధన్. అలాగే ఒక్కొక్కరు కాకుండా ఒక టీంగా కలిసి పనిచేస్తే ఎంతటి పని అయినా విజయవంతంగా పూర్తి చేయొచ్చని టీం వర్క్ గురించి వాయిస్ ఓవర్ డైలాగ్ తో చెప్తూ హ్యాపీ ఫేసెస్ తో లాస్ట్ ఎపిసోడ్ ని ఫినిష్ చేసిన విధానం చాలా బాగుంది.

బీటెక్  స్టూడెంట్స్  స్టడీ ఎలా ఉంటుందో వారి కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుందో  ‘హ్యాపీ డేస్’ సినిమాతో ప్రేక్షకులకు చూపించి సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. అలాగే బీటెక్ కంప్లీట్ అయ్యాక సాఫ్ట్ వేర్ జాబ్స్ మీద కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ అవేవి హిట్ అవ్వలేదు. అంత ఇంపాక్ట్ చూపించలేదు. అందుకే డైరెక్టర్ శివ సాయి వర్ధన్ సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరిన ఫ్రెషర్స్ కథను మెయిన్ ప్లాట్ గా తీసుకొని తన స్కీన్ ప్లే , సన్నివేశాలతో సాఫ్ట్ వేర్ లైఫ్ ని అద్దం పట్టేలా చూపించి మెప్పించాడు. నిజానికి దర్శకుడు డిజైన్ చేసుకున్న కేరెక్టర్స్ కి బెస్ట్ ఇచ్చి ఆ పాత్రలతో కథను సరదాగా నడిపిస్తూ తమ నేచురల్ యాక్టింగ్ తో మెస్మరైజు చేశారు యాక్టర్స్. కొత్త వాళ్ళయినప్పటికీ కేరెక్టర్స్ కి బెస్ట్ ఇచ్చి సిరీస్ కి హైలైట్ గా నిలిచారు. ముఖ్యంగా రామ్ నితిన్ , సుదర్శన్ గోవింద్ తమ యాక్టింగ్ తో బాగా ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరికీ మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. అలాగే సిరీస్ లో కనిపించిన మిగతా యాక్టర్స్ కూడా మంచి కేరెక్టర్స్ తో బిజీ అయ్యే అవకాశం ఉంది.

బీటెక్ కంప్లీట్ చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరిన యువత కథతో ఆఫీస్ డ్రామాగా తెరకెక్కిన హలో వరల్డ్  ప్రేక్షకులని సాఫ్ట్ వేర్ ప్రపంచంలోకి తీసుకెళ్ళి కొన్ని గంటల పాటు మెప్పిస్తుంది. కొన్ని సార్లు  ఆడియన్ కూడా తను సాఫ్ట్ వేర్ ఉద్యోగిలా ఊహించుకుంటూ ఆ సీన్స్ కి కనెక్ట్ అవుతాడు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ జీవితాన్ని, వారి వర్క్ స్పేస్ ని చాలా రియలిస్టిక్ గా చూపించే ప్రయత్నం చేసి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు శివ సాయి వర్ధన్. అలాగే ఈ కథను నమ్మి ఈ సిరీస్ ని క్వాలిటీ గా నిర్మించిన కొణిదెల నిహారికా ను కూడా మెచ్చుకోవాల్సిందే. ఫన్ , సెంటిమెంట్ , రొమాన్స్, డ్రామా ఇలా అన్ని మిక్స్ చేసి తెరకెక్కిన హలో వరల్డ్ వెబ్ సిరీస్ పూర్తి స్థాయిలో మెప్పిస్తుంది. ఈ కథను ఎనిమిది ఎపిసోడ్స్ లో చెప్పడం వల్ల చివర్లో వచ్చే ఎపిసోడ్స్ లో కొన్ని సన్నివేశాలు కాస్త బోర్ కొడతాయి. అవి మినహాయిస్తే ఈ ఆఫీస్ డ్రామా సిరీస్ ఆడియన్స్ ని పక్కా ఎంటర్టైన్ చేస్తుంది.

రేటింగ్ : 3 :25 /5