'ప్రేమ లీల పెళ్లి గోల' రివ్యూ

Tuesday,July 04,2017 - 03:16 by Z_CLU

నటీ నటులు : విష్ణు విశాల్, నిక్కీ గ‌ల్రానీ

సంగీతం : సి.సత్య

నిర్మాణం : శ్రీ మ‌హావీర్ ఫిలింస్ అధినేత

నిర్మాత : నిర్మాత పార‌స్

కథ – దర్శకత్వం : ఎళిల్

 

విష్ణు విశాల్ హీరోగా తమిళ్ లో సూపర్ హిట్ సాధించిన ‘వెళ్ళై కారన్’ సినిమా ‘ప్రేమ లీల పెళ్లి గోల’ అనే టైటిల్ తో ఇటీవలే డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అయింది. కామెడీ ఎంటర్టైనింగ్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఎంటర్టైన్ చేసిందో.. చూద్దాం.

కథ :

ఎం.ఎల్.ఎ జాకెట్ జానకి రామ్( రోబో శంకర్) రైట్ హ్యాండ్ గా ఉంటూ ఓ టైలర్ గా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు మురళి(విష్ణు విశాల్). ఒకొనొక సందర్భంలో ప్రభుత్వం తరుపున ఎం.ఎల్.ఎ గా 25 జంటలకు పెళ్లిళ్లు చేయించాలనుకుంటాడు జాకెట్ జానకి రామ్.. ఆ జంటల్లో ఒక జంట తగ్గడంతో తన ఎం.ఎల్.ఎ  పరువు  పోతుందని భావించి తన స్నేహితుడు కరక్కాయ(సూరి) కి పుష్ప అనే అమ్మాయినిచ్చి ఆ జంటలతో కలిపి పెళ్లి చేయించి ఎం.ఎల్.ఎ పరువు కాపాడతాడు మురళి. ఆ తర్వాత పుష్ప ఓ ఐటెం గర్ల్ అని తెలుసుకున్న కరక్కాయ మురళి, ఎం.ఎల్.ఎ సాయంతో విడాకులు తీసుకోవాలనుకుంటాడు. మరో వైపు తను ప్రేమిస్తున్న అర్చన(నిక్కీ గలరాణి) ఎప్పటికైనా పోలీస్ ఇన్స్పెక్టర్ అవ్వాలనుకుంటుందని తెలుసుకున్న మురళి ఎం.ఎల్.ఎ సాయం తో డిజిపి తో మాట్లాడి పోలీస్ ట్రైనింగ్ లో అర్చన ను సెలెక్ట్ చేయించాలనుకుంటాడు. ఈ క్రమంలో తన రైట్ హ్యాండ్ మురళి కోసం అర్చన ని పోలీస్ గా సెలెక్ట్ చేయించడం కోసం బయలు దేరిన ఎం.ఎల్.ఎ జాకెట్ జానకి రామ్ అనుకోకుండా హాస్పటల్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మినిస్టర్ ని కలవడానికి వెళ్తాడు. తనని కలవడానికి వచ్చిన ఎల్.ఎల్.ఎ జానకిరామ్ కి మినిస్టర్ తను అక్రమంగా సంపాదించిన డబ్బు దాచిన స్థలం చెప్పి మరణిస్తాడు. విషయం తెలుసుకున్న భూతం(రవి మరియన్) ఎం.ఎల్.ఎ జానకి రామ్ దగ్గర డబ్బు దాచిన స్థలం తెలుసుకోవాడనికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఫైనల్ గా మురళి తను ప్రేమించిన అర్చన ప్రేమను పొందగలిగాడా. కరక్కాయ పుష్ప నుంచి విడాకులు తీసుకున్నాడా.. భూతం ఎం.ఎల్.ఎ నుంచి డబ్బు చాచిన స్థలాన్ని తెలుసుకోగలిగాడా.. అనేది సినిమా కథాంశం.

నటీ నటుల పనితీరు :

తమిళ్ లో పలు పాత్రలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విష్ణు విశాల్ హీరోగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మురళి అనే సాదా సీదా కుర్రాడి పాత్రలో ఒదిగిపోయి నటించాడు. నిక్కీ గల్రాని తన నటనతో గ్లామర్ తో అర్చన రోల్ కి పూర్తి న్యాయం చేసింది.
ఈ సినిమాలో నటించిన నటుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రోబో శంకర్ గురించే. ఎం.ఎల్.ఎ క్యారెక్టర్ తో ఎంటర్టైన్ చేసి సినిమాకు హైలైట్ గా నిలిచాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో తన కామెడీ నటన తో బాగా ఎంటర్టైన్ చేశాడు రోబో శంకర్. భూతం క్యారెక్టర్ తో రవి మరియన్ కూడా బాగానే ఎంటర్టైన్ చేశాడు. సూరి కామెడీ పరవాలేదు. మిగతా నటీ నటులందరూ తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేసి ఎంటర్టైన్ చేశారు.

 

టెక్నీషియన్స్ పని తీరు :

సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ గురించి, సినిమాటోగ్రఫీ గురించే. సి.సత్య అందించిన మ్యూజిక్, శక్తి సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ పరవాలేదు. ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. మాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.

జీ సినిమాలు సమీక్ష :

తమిళ్ నుంచి తెలుగులోకి ఓ సినిమా డబ్ అవుతుందంటే ఆ సినిమాలో ఎంతో కొంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ లేదా ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే తమిళ్ లో ఇటీవలే సూపర్ హిట్ గా నిలిచిన ‘వేలైను వన్దుట్ట వెళ్ళై కారన్’ సినిమా తెలుగు లో ‘ప్రేమ లీల పెళ్లి గోల’ గా రీలీజ్ అవుతుందనగానే ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి.
కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ లో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎంటర్టైన్ చేసినప్పటికీ తెలుగులో ఓ మోస్తరుగా ఎంటర్టైన్ చేసింది. ఫస్ట్ హాఫ్ కాస్త స్లో గా నడిపించి బోర్  కొట్టించిన దర్శకుడు ఎళిల్ సెకండ్ హాఫ్ లోమాత్రం తన ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే బాగానే ఎంటర్టైన్ చేశాడు. ముఖ్యంగా క్యారెక్టర్స్ కి తగిన నటులను సెలెక్ట్ చేసుకొని ఆ క్యారెక్టర్స్ తో సెకండ్ హాఫ్ లో ఫుల్ గా ఎంటర్టైన్  చేసి ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా హీరో క్యారెక్టర్, నిక్కీ గల్రాని గ్లామర్, మ్యూజిక్, కామెడీ సీన్స్,ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలవగా, ఫస్ట్ హాఫ్ లో స్లో స్క్రీన్ ప్లే, బోర్ కొట్టించే సీన్స్ మైనస్.

ఫైనల్ గా ఒకరి ప్రేమ లీల మరొకరి పెళ్లి గోల అనే కథతో ఎంటర్టైనింగ్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే అనిపించినా, సెకండ్ హాఫ్ లో మాత్రం బాగానే ఎంటర్టైన్ చేస్తుంది..

రేటింగ్ : 2.5  /5