ZeeCinemalu – May 27

Wednesday,May 26,2021 - 09:46 by Z_CLU

/.9ilondon-babulu-zeecinemalu

లండన్ బాబులు నటీనటులు : స్వాతి, రక్షిత్ ఇతర నటీనటులు : మురళి శర్మ, ఆలీ, రాజా రవీంద్ర, జీవా, సత్య, ధనరాజ్, అజయ్ ఘోష్, సాయి, సత్యకృష్ణ తదితరులు… మ్యూజిక్ డైరెక్టర్ : కె. డైరెక్టర్ : చిన్నికృష్ణ ప్రొడ్యూసర్ : మారుతి రిలీజ్ డేట్ : 17 నవంబర్ 2017 అంతర్వేది అనే పల్లెటూరిలో సాధారణ కుర్రాడిగా జీవితాన్ని గడిపే గాంధీ(రక్షిత్) అప్పుల కారణంగా దొంగదారిన లండన్ వెళ్లి డబ్బు సంపాదించాలని స్నేహితుడు(సత్య)తో కలిసి హైదరాబాద్ వస్తాడు. పాస్ పోర్టు నుంచి ఇమ్మిగ్రేషన్ వీసా వరకూ జరిగే అన్యాయం నేపథ్యంలో గాంధీ… సూర్య కాంతం( స్వాతి)ని ఎలా కలుస్తాడు. ఈ క్రమంలో గాంధీ కి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి..లండన్ వెళ్లాలని ఎన్నో కలలు కన్న గాంధీ చివరికీ లండన్ వెళ్లగలిగాడా… అనేది సినిమా కథాంశం.

======================= vasantham-zeecinemalu

వసంతం నటీనటులు : వెంకటేష్, ఆర్తి అగర్వాల్, కళ్యాణి ఇతర నటీనటులు : V.V.S. లక్ష్మణ్, ఆకాష్, సునీల్, చంద్ర మోహన్, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్ డైరెక్టర్ : విక్రమన్ ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్ రిలీజ్ డేట్ : 11 జూలై 2003 స్నేహానికి, ప్రేమకు మధ్య డిఫెరెన్స్ ని అద్భుతంగా ఎలివేట్ చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వసంతం. ఎంత పెద్ద త్యాగానికైనా వెనకాడని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కథే ఈ సినిమా. ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి.

========================= Satamanam-Bhavati-zeecinemalu

శతమానంభవతి నటీనటులు : శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, జయసుధ, నరేష్, ఇంద్రజ, రాజా రవీంద్ర, హిమజ, ప్రవీణ్ మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ. జే. మేయర్ డైరెక్టర్ : సతీష్ వేగేశ్న ప్రొడ్యూసర్ : దిల్ రాజు రిలీజ్ డేట్ : 14 జనవరి 2017 ఆత్రేయపురం అనే గ్రామంలో రాఘవ రాజు(ప్రకాష్ రాజ్) జానకమ్మ(జయసుధ) అనే దంపతులు తమ పిల్లలు విదేశాల్లో స్థిరపడి తమను చూడడానికి రాకపోవడంతో కలత చెంది తన మనవడు రాజు (శర్వానంద్) తో కలిసి సొంత ఊరిలోనే జీవిస్తుంటారు. ఈ క్రమంలో పిల్లల్ని ఎలాగైనా సంక్రాంతికి తమ ఊరికి రప్పించాలని రాజు గారిని కోరుతుంది జానకమ్మ. తన భార్య కోరిక మేరకూ ఎప్పుడు కబురుపెట్టినా రాని పిల్లల కోసం ఒక పథకం వేసి సంక్రాంతికి ఊరు రప్పిస్తాడు రాఘవ రాజు. ఇంతకీ రాజు గారు వేసిన ఆ పథకం ఏమిటి? రాజు గారి కబురు మేరకు స్వదేశం తిరిగొచ్చిన పిల్లలు తాము దూరంగా ఉండడం వల్ల తల్లిదండ్రుల పడుతున్న భాధ ఎలా తెలుసుకున్నారు? అనేది ఈ సినిమా కథాంశం.

========================== a-aa-zeecinemalu

అ..ఆ నటీనటులు : నితిన్, సమంతా అక్కినేని , అనుపమ పరమేశ్వరన్ ఇతర నటీనటులు : నరేష్, నదియా, హరితేజ, అనన్య, రావు రమేష్, శ్రీనివాస్ అవసరాల మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ.జె.మేయర్ డైరెక్టర్ : త్రివిక్రమ్ ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ రిలీజ్ డేట్ : 2 జూన్ 2016 నితిన్, సమంతా జంటగా నటించిన బ్యూటిఫుల్ లవ్ ఎంటర్ టైనర్ అ..ఆ. రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అనసూయ (సమంతా), తల్లి క్రమశిక్షణతో విసుగెత్తి పోతుంది. దానికి తోడు తన ఇష్టా ఇష్టాలతో సంబంధం కుదర్చడం మరో తలపోతులా ఫీలవుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తండ్రి సలహా మేరకు తన మేనత్త ఇంటికి వెళ్తుంది. ఆనంద్ విహారి ( నితిన్) తో పాటు, తక్కిన ఫ్యామిలీని కలుసుకుంటుంది. ఆస్తి, ఆర్భాటాలు లేకపోయినా అనురాగ ఆప్యాయతలతో ఉండే ఆ ఫ్యామిలీని ఇష్టపడటమే కాదు ఆనంద్ విహారితో ప్రేమలో కూడా పడుతుంది అనసూయ. ఆ తరవాత ఏం జరుగుతుంది..? అనేదే ఈ సినిమాలో ప్రధాన కథాంశం.

============================ brother-of-bommali-zeecinemalu

బ్రదర్ ఆఫ్ బొమ్మాలి నటీనటులు : అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర డైరెక్టర్ : చిన్ని కృష్ణ ప్రొడ్యూసర్ : అమ్మి రాజు కనిమిల్లి రిలీజ్ డేట్ : నవంబర్ 7 , 2014 కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా , కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. కోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ పెరఫార్మెన్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, కామెడీ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics