18 Pages First Look Ready

Thursday,May 27,2021 - 12:05 by Z_CLU

అర్జున్ సుర‌వ‌రం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ హిట్ త‌రువాత‌ యంగ్ డైన‌మిక్ హీరో నిఖిల్, మ‌ళ‌యాలీ ముద్దుగుమ్మ అనుప‌మ జంట‌గా కుమారి 21 ఎఫ్ ఫేమ్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం 18 పేజీస్. మెగాప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ ప్రజెంట్ చేస్తున్న ఈ సినిమాకు స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ స్టోరీ-స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. జీఏ2పిక్చ‌ర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రెడీ అయింది.

18 pages movie

జూన్ 1న నిఖిల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 18 పేజీస్ ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేయ‌డానికి యూనిట్ ప్లాన్ చేసింది. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన అప్ డేట్ పోస్టర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

[caption id="attachment_180406" align="alignnone" width="944"]nikhil-anupama-18-pages-movie 18 pages సినిమా సెట్స్ లో హీరోహీరోయిన్[/caption]

ఓ అబ్బాయ్ చేతిలో ఫోను, ఓ అమ్మాయి చేతిలో పెన్ ఉన్న స్టిల్స్ తో ఈ అప్ డేట్ పోస్టర్ విడుద‌ల చేశారు. క్రెజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ సంగీత ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics