ZeeCinemalu – June 4

Thursday,June 03,2021 - 09:34 by Z_CLU

nakshatram-zeecinemalu

నక్షత్రం నటీనటులు : సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్, రెజినా ఇతర నటీనటులు : తనిష్, శ్రియ శరణ్, ప్రకాష్ రాజ్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్ డైరెక్టర్ : కృష్ణవంశీ ప్రొడ్యూసర్స్ : K. శ్రీనివాసులు, S. వేణు గోపాల్ రిలీజ్ డేట్ : 4 ఆగష్టు రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంతటి ప్రాధాన్యత కలిగి ఉంటుందో.. సమాజంలో ‘పోలీస్’ పాత్ర అలాంటిది. పోలీస్ అంటే హనుమంతుడు అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కింది నక్షత్రం. పోలీస్ అవ్వాలనే ప్రయత్నంలో వున్న ఓ యువకుడి కథే ఈ ‘నక్షత్రం’. అతడ్ని పోలీస్ కాకుండా అడ్డుకున్నది ఎవరు.. చివరికి సందీప్ కిషన్ పోలీస్ అయ్యాడా లేదా అనేది స్టోరీ. ఈ బేసిక్ ప్లాట్ కు లవ్, రొమాన్స్, సెంటిమెంట్ ను యాడ్ చేశాడు దర్శకుడు కృష్ణవంశీ. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ స్పెషల్ రోల్ ప్లే చేశాడు.

========================

shailaja-reddy-alludu-zeecinemalu

శైలజారెడ్డి అల్లుడు నటీనటులు : నాగ చైతన్య, అనూ ఇమ్మాన్యువెల్ ఇతర నటీనటులు : రమ్య కృష్ణన్, నరేష్, మురళీ శర్మ, కళ్యాణి నటరాజన్, వెన్నెల కిషోర్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : గోపీ సుందర్ డైరెక్టర్ : మారుతి దాసరి ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ రిలీజ్ డేట్ : 13 సెప్టెంబర్ 2018 ఈగోకి బ్రాండ్ అంబాసిడర్ అయిన పెద్ద వ్యాపారవేత్త (మురళి శర్మ) ఏకైక కొడుకు చైతు(నాగచైతన్య). తన తండ్రిలా కాకుండా కాస్త సహనం, ఓపికతో జీవితాన్ని కూల్ గా గడుపుతుంటాడు. ఓ సందర్భంలో చైతూకి ఈగో కు మారుపేరైన అను(అను ఇమ్మానియేల్) పరిచయమవుతుంది. ఆ పరిచయం వారిద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. అలా తండ్రి , ప్రియురాలి ఈగోల మధ్య నలిగిపోయే చైతూ జీవితంలోకి అనుకోకుండా పౌరుషంతో గల ఈగో ఉన్న మరో వ్యక్తి వస్తుంది.. ఆవిడే శైలజా రెడ్డి(రమ్యకృష్ణ). తన ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లడం కోసం స్నేహితుడు చారి(వెన్నెల కిషోర్)తో కలిసి అత్తయ్య శైలజారెడ్డి ఇంట్లో అడుగుపెడతాడు చైతూ. మామయ్య సహకారంతో తల్లికూతురుని చైతూ ఎలా కలిపాడు, వాళ్ల ఇగోల్ని ఎలా జయించాడు అనేది బ్యాలెన్స్ కథ.

===========================

Sahoo-Prabhas-zeecinemalu

సాహో నటీనటులు: ప్రభాస్, శ్రద్దా కపూర్, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, వెన్నెల కిషోర్‌, చుంకీ పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేఖ‌ర్‌ త‌దిత‌రులు బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జిబ్రాన్ సినిమాటోగ్రాఫర్ : మధి ఆర్ట్ డైరెక్టర్ : సాబు సిరీల్ నిర్మాణం: యువి క్రియేషన్స్ నిర్మాతలు: వంశీ-ప్రమోద్ కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుజీత్ రన్ టైమ్: 171 నిమిషాలు ముంబయిలో 2వేల కోట్ల రూపాయల దొంగతనం జరుగుతుంది. అలాంటివి వరుసగా 3 జరుగుతాయి. దీంతో పోలీసులు ఎలర్ట్ అవుతారు. ఈ కేసును సీక్రెట్ ఏజెంట్ అశోక్ చక్రవర్తి (ప్రభాస్)కి అప్పగిస్తారు. అతడికి రిపోర్టింగ్ గా పోలీస్ ఆఫీసర్లు అమృతా నాయర్ (శ్రద్ధాకపూర్), గోస్వామి (వెన్నెల కిషోర్), డేవిడ్ (మురళీ శర్మ)ను అప్పగిస్తారు. దొంగను కనుక్కునే ప్రాసెస్ లో.. 2వేల కోట్ల రాబరీ కాస్తా 2 లక్షల కోట్ల వ్యవహారంగా మారుతుంది. సరిగ్గా ఇక్కడే ట్విస్టుల మీద ట్విస్ట్ లు వస్తాయి. కేసును డీల్ చేస్తున్న అశోక్ చక్రవర్తి ఎవరు? అశోక్ కు సాహోకు ఏంటి సంబంధం? మాఫియాతో అశోక్ ఎందుకు పెట్టుకుంటాడు? అమృతను ప్రేమించిన అశోక్ ఆమెను తిరిగి కలిశాడా లేదా అనేది స్టోరీ.

===========================

ready-ram-zeecinemalu

రెడీ నటీనటులు : రామ్, జెనీలియా ఇతర నటీనటులు : బ్రహ్మానందం, నాజర్, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస రావు,జయప్రకాష్ రెడ్డి, సుప్రీత్, షఫీ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్ డైరెక్టర్ : శ్రీను వైట్ల ప్రొడ్యూసర్ : స్రవంతి రవి కిషోర్ రిలీజ్ డేట్ : 19 జూన్ 2008 రామ్ జెనీలియా నటించిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ రెడీ. శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. కామెడీ తో పాటు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

===========================

Gajakesari గజకేసరి yash fpc zeecinemalu

గజకేసరి నటీనటులు - యష్, అమూల్య, ‘కాలకేయ’ ప్రభాకర్‌, అనంత్‌ నాగ్‌, గిరిజా లోకేష్‌, మాండ్య రమేష్‌, జాన్‌ విజయ్‌ తదితరులు ప్రొడ్యూసర్లు - శ్రీ వేదాక్షర మూవీస్‌, కలర్స్ అండ్‌ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ డైరక్టర్ - కృష్ణ మ్యూజిక్ డైరక్టర్ - హరికృష్ణ ‘కె.జి.యఫ్‌’ హీరో యశ్‌ హీరోగా నటించిన చిత్రం ‘గజకేసరి’. కన్నడంలో హిస్టారికల్ యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమాకి యస్.కృష్ణ దర్శకత్వం వహించారు. యష్ గెటప్, యాక్షన్ ఈ సినిమాకు హైలెట్. ‘‘ప్రాణం పోయినా నన్ను నమ్ముకున్నవారి చేయి వదిలిపెట్టను’’ అంటూ యశ్‌ చెప్పే డైలాగ్‌ అందరినీ ఆకట్టుకుంటుంది.

‘‘ప్రతి తల్లీ కోరుకునే బిడ్డ...ప్రతి రాజు గర్వపడే సేనాధిపతి..మన గజకేసరి’’, ‘‘శ్రీలంక నుంచి వచ్చానంటే మామూలు రాక్షసుడిని అనుకున్నావా.. కాదు పదితలల రావణుడుని..’’ అంటూ సాగే సంభాషణలు ఈ సినిమాలో మెయిన్ ఎట్రాక్షన్స్. దీనికి తోడు క్లైమాక్స్ ఫైట్ బాహుబలిని గుర్తుకుతెస్తుంది. అమూల్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో... ‘కాలకేయ’ ప్రభాకర్‌, అనంత్‌ నాగ్‌, గిరిజా లోకేష్‌, మాండ్య రమేష్‌, జాన్‌ విజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఐకాన్‌ స్పేస్‌, సల్ల కుమార్‌ యాదవ్‌ సమర్పణలో వచ్చిన ఈ సినిమాని శ్రీ వేదాక్షర మూవీస్‌, కలర్స్ అండ్‌ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి.

=======================

devadas-nani-zeecinemalu

దేవదాస్ నటీనటులు : నాగార్జున అక్కినేని, నాని, రష్మిక మండన్న, ఆకాంక్ష సింగ్ ఇతర నటీనటులు : R. శరత్ కుమార్, కునాల్ కపూర్, నవీన్ చంద్ర, నరేష్, సత్య కృష్ణన్, మురళీ శర్మ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ డైరెక్టర్ : శ్రీరామ్ ఆదిత్య ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్ రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2018 దాస్ ఓ డాక్టర్. కార్పొరేట్ హాస్పిటల్ లో పనిచేయలేక ఓ చిన్న క్లినిక్ నడిపిస్తుంటాడు. దేవ ఓ మాఫియా డాన్. ఓ గొడవ కారణంగా హైదరాబాద్ వచ్చిన దేవకు ఎన్ కౌంటర్ లో బుల్లెట్ గాయం అవుతుంది. పోలీసుల నుంచి తప్పించుకొని దాస్ క్లినిక్ కు చేరుకుంటాడు. గాయంతో వచ్చిన దేవాను దాస్ ఆదుకుంటాడు. దాస్ మంచి మనసుకు దేవ కూడా ఫిదా అవుతాడు. అలా ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోతారు. మరోవైపు పోలీసులు దేవా కోసం వెదికే క్రమంలో దాస్ పై ఓ కన్నేసి ఉంచుతారు. ఈ క్రమంలో వలపన్ని దేవాను అరెస్ట్ చేసే సమయానికి, దాస్ సమక్షంలోనే ఓ క్రిమినల్ ను దేవా చంపేస్తాడు. ఆ చావు చూసి చలించిపోయిన దాస్, దేవాతో ఫ్రెండ్ షిప్ కట్ చేసుకుంటాడు. అదే సమయంలో దాస్ చెప్పిన మాటలు దేవాను మార్చేస్తాయి. ఫైనల్ గా దాస్, దేవ కలిశారా లేదా..? విలన్లు, పోలీసులు ఏమయ్యారు? మధ్యలో రష్మిక, ఆకాంక్షల స్టోరీ ఏంటి? ఇది తెలియాలంటే దేవదాస్ చూడాల్సిందే.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics