Fahadh Faasil own dubbing for Pushpa

Friday,June 04,2021 - 02:57 by Z_CLU

ఈ మధ్య ఇతర పరిశ్రమల నుండి తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్న నటీనటులు వారి పాత్రలకు తెలుగు నేర్చుకొని మరీ సొంత డబ్బింగ్ చెప్పుకోవడం చూస్తున్నాం. తాజాగా ఆ లిస్టులో మరో నటుడు చేరనున్నాడు. అతను ఎవరో కాదు ఫహాద్ ఫాజిల్. మలయాళం సినిమాల్లో విభిన్న పాత్రలు చేసి నటుడిగా ఎన్నో అవార్డులు దక్కించుకున్న ఫహాద్ తమిళ్ లో కూడా సినిమాలు చేశాడు. ఇప్పుడు అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

fahadh faasil zeecinemalu

సినిమాలో తన క్యారెక్టర్ కి తనే తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటానని క్యారెక్టర్ చెప్పగానే సుకుమార్ తో అన్నాడట ఫహాద్. క్యారెక్టర్ మీద తనకున్న నమ్మకంతో, సినిమా మీద ప్రేమతో అలా అనేసరికి సుక్కు షాక్ అయ్యాడట. తప్పకుండా మీరే చెప్పండి అంటూ ఫహాద్ సొంత డబ్బింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట సుక్కు. ఏదేమైనా తెలుగు రాకపోయినా క్యారెక్టర్ వినగానే భాష నేర్చుకొని తనే సొంతంగా వాయిస్ ఇచ్చుకోవడం అంటే ఫహాద్ ని మెచ్చుకోవాల్సిందే. షూటింగ్ లో సుక్కు అండ్ టీం ఫహాద్ కి తెలుగు భాష గురించి చెప్తూ డైలాగులు నేర్పిస్తున్నారట.

ఇక నటుడిగా మలయాళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సుకుమార్ క్యారెక్టర్ చెప్పిన వెంటనే తెలుగులో 'పుష్ప' సినిమాకు ఓకె చెప్పేసి సైన్ చేశాడు ఫహాద్. పుష్ప లో ఫహాద్ విలన్ గా నటిస్తున్నాడని న్యూస్ బయటికి రాగానే సినిమాపై మరింత క్రేజ్ వచ్చింది. ఫహాద్ ని అభిమానించే తెలుగు ప్రేక్షకులు సుకుమార్ 'పుష్ప' సినిమాకి అతన్ని సెలెక్ట్ చేసుకున్నందుకు సంతోష పడ్డారు.

ఇటివలే ఫహద్ పై కొన్ని సన్నివేశాలు షూట్ చేశారు యూనిట్. షూటింగ్స్ పర్మీషణ్ ఇచ్చిన వెంటనే పుష్ప మరో షెడ్యుల్ మొదలు కానుంది. అ షెడ్యుల్ లో ఫహాద్ పై కీలక సన్నివేశాలు యాక్షన్ ఎపిసోడ్స్ తీస్తారు. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పుష్ప కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics