KGF 2 Teaser Review

Friday,January 08,2021 - 11:47 by Z_CLU

ఇండియా మొత్తం ఎదురుచూస్తున్న రాకీ భాయ్ మరోసారి వచ్చేశాడు. KGF Chapter-2 టీజర్ రిలీజైంది. పాన్-ఇండియా ఆడియన్స్ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా.. గ్రాండ్ గా ఉంది టీజర్.

కేవలం రాకీ భాయ్ కోసం టీజర్ కట్ చేయలేదు. యష్ తో పాటు కీలక పాత్రలైన రావురమేష్, సంజయ్ దత్, రవీనా టాండన్, ఈశ్వరీ రావు లాంటి పాత్రల్ని కూడా సింగిల్ టీజర్ లో రివీల్ చేశారు. ఎప్పట్లానే దుమ్ము లేచే విజువల్స్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ లో హైలెట్ గా నిలిచాయి.

ఇవన్నీ ఒకెత్తయితే చివర్లో యష్ ఎంట్రీ, అతడి మాస్ ఎలివేషన్ పీక్స్. బాగా వేడెక్కిన మిషన్ గన్ గొట్టంపై అతడు సిగరెట్ వెలిగించడం మాస్ జనాల్ని ఎట్రాక్ట్ చేస్తోంది.

ఆల్రెడీ సోషల్ మీడియాలో కేజీఎఫ్ మేనియా స్టార్ట్ అయిపోయింది. నిన్న రాత్రి నుంచే ఈ టీజర్ అన్ని భాషల్లో, దాదాపు అన్ని సోషల్ మీడియా వేదికల్లో ట్రెండింగ్ గా నిలిచింది. టీజర్ ను విడుదల చేసిన మేకర్స్.. రిలీజ్ డేట్ మాత్రం చెప్పకపోవడం కొంచెం డిసప్పాయింట్ చేసింది.