Weekend Release – This Week 11 Movies

Thursday,October 13,2022 - 02:20 by Z_CLU

గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లాంటి పెద్ద సినిమాలతో దసరా బాక్సాఫీస్ కళకళలాడింది. దసరా సీజన్ ముగియడంతో, ఇప్పుడు ఒక్కసారిగా చిన్న సినిమాలు క్యూ కట్టాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఈ వీకెండ్ ఏకంగా 11 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

CRAZY-FELLOW-FL

ఈ వీకెండ్ ఓ మోస్తరు అంచనాలతో వస్తున్న సినిమా క్రేజీ ఫెలో మాత్రమే. ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఈ సినిమాను కేకే రాధామోహన్ నిర్మించారు. టైటిల్ కు తగ్గట్టే ఈ సినిమా చాలా క్రేజీగా ఉంటుందని అంటున్నాడు దర్శకుడు ఫణి కృష్ణ.

Hebah Patel , Sunil starring 'Geetha' movie Release on Oct 14th

ఈ సినిమాతో పాటు హెబ్బా పటేల్ లీడ్ రోల్ పోషించిన గీత సినిమా వస్తోంది. విశ్వ దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ సినిమాలో రామ్ కార్తీక్, సునీల్, సాయికిరణ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలతో పాటు కాంతార అనే కన్నడ డబ్బింగ్ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది ప్రముఖులు ఈ సినిమాను ప్రత్యేకంగా మెచ్చుకోవడంతో, ఆడియన్స్ లో అంచనాలు పెరిగాయి.

raraju yash

ఇక కేజీఎఫ్ ఫేమ్ యష్ హీరోగా నటించిన పాత సినిమా రారాజు పేరిట రేపు థియేటర్లలోకి వస్తోంది. దీంతో పాటు రుద్రనేత్రి, నీతో, నా వెంట పడుతున్న చిన్నావాడెవడమ్మా, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, నిన్నే పెళ్లాడతా సినిమాలు రేపు థియేటర్లలోకి వస్తున్నాయి.

రీసెంట్ గా మొదలైన రీ-రిలీజ్ ట్రెండ్ ఈ వీకెండ్ కూడా కొనసాగుతోంది. ప్రభాస్ హీరోగా నటించిన రెబల్ సినిమా థియేటర్లలో రీ-రిలీజ్ అవుతోంది. ఇక నితిన్ నటించిన అడవి సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నాడు ఆర్జీవీ.

ఇలా ఈ వీకెండ్ ఏకంగా 11 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఏ సినిమా క్లిక్ అవుతుందో..!

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics