Weekend Release – This week Khiladi, FIR, Sehari, DJ Tillu

Wednesday,February 09,2022 - 09:05 by Z_CLU

ప్రతీ వారం థియేటర్స్ లో కొన్ని సినిమాలు సందడి చేస్తుంటాయి. ఈ వారం కూడా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఫిబ్రవరి 11 న మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఖిలాడి' థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది. 'క్రాక్' తర్వాత రవితేజ నుండి వస్తున్న సినిమా కావడంతో ఖిలాడి పై అంచనాలున్నాయి. రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. రిలీజ్ కి ముందే సాంగ్స్ మంచి బజ్ క్రియేట్ చేసి ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

అదే రోజు రవితేజ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ రిలీజ్ చేస్తున్న 'FIR' ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విష్ణు విశాల్ , గౌతం వాసుదేవ్ మీనన్ , మంజిమా మోహన్ తదితరులు నటించిన ఈ డబ్బింగ్ సినిమాపై కూడా ఓ మోస్తారు అంచనాలున్నాయి. విష్ణు విశాల్ చేసిన సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. ఈ హీరో మంచి కథలు ఎంచుకొని సినిమాలు చేస్తాడనే గుర్తింపు ఉంది. అందుకే రవితేజ ఈ సినిమాను ప్రెజెంట్స్ చేస్తున్నారు.

ఈ రెండు సినిమాలతో పాటు ఫిబ్రవరి 11న సెహరి అనే చిన్న సినిమా కూడా విడుదలవుతుంది. హర్ష కనుమిల్లి , సిమ్రాన్ చౌదరి జంటగా జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టైటిల్ సాంగ్ బాగా రీచ్ అయింది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో మంచి ఫన్ ఉంటుందని అందరూ ఎంజాయ్ చేస్తారని యూనిట్ చెప్తోంది.

ఇక మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 12న సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన 'DJ TILLU' థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది. సితార ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసి సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. విమల్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు సిద్దు స్క్రీన్ ప్లే -డైలాగ్స్ అందించాడు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా కొన్ని ఇన్ పుట్స్ అందించారని అవి సినిమాకు ప్లస్ అయ్యాయని టీం చెప్పుకున్నారు. ఇప్పటికే సాంగ్స్ , ట్రైలర్ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేస్తుంది.

ఇలా ఈ వారం నాలుగు సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. మరి వీటిలో ఏ సినిమా మంచి వసూళ్ళు అందుకొని ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.