Vishwak Sen’s father reveals key element of Paagal Movie

Wednesday,August 11,2021 - 08:06 by Z_CLU

కొన్ని సినిమా వేడుకల్లో అనుకోకుండా కంటెంట్ రివీల్ అవుతుంటుంది. తాజాగా 'పాగల్' సినిమా గురించి అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ను రిలీజ్ కి ముందే రివీల్ అయింది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా కంప్లీట్ లవ్ స్టోరీ అని టీజర్ , ట్రైలర్స్ చూస్తేనే అర్థమైపోతుంది. కానీ ఇందులో ఇంకో సెగ్మెంట్ కూడా ఉంది. దాన్ని తాజాగా పాగల్ ట్రైలర్ లాంచ్ లో హీరో విశ్వక్ సేన్ తండ్రి స్టేజిపై రివీల్ చేసేశాడు.

'పాగల్' టీం కి ఆల్ తే బెస్ట్ అంటూ విష్ చేస్తూ ఇందులో మదర్ సెంటిమెంట్ కూడా ఉంది. అది అందరికీ నచ్చుతుందని ఎగ్జయిట్ మెంట్ తో మైక్ పట్టుకొని చెప్పేసారు విశ్వక్ సేన్ తండ్రి రాజు. సినిమాలో ఉండే మదర్ సెంటిమెంట్ ని ఇప్పటి వరకు దాచి పెట్టిన టీం... విశ్వక్ ఫాదర్ రివీల్ చేసేయడంతో అవాక్కయ్యారు. అదే స్టేజిపై విశ్వక్ సేన్ కూడా అబ్బా నాన్న రివీల్ చేసేసాడే అంటూ నవ్వుకున్నాడు.

తర్వాత తండ్రి చెప్పిన మదర్ సెంటిమెంట్ గురించి విశ్వక్ సేన్ ఎక్స్ టెండ్ చేశాడు. "నాన్న చెప్పినట్టు సినిమాలో మంచి మదర్ సెంటిమెంట్ ఉంది. భూమిక గారు నాకు మదర్ గా కనిపిస్తారు. రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాం. కానీ మా డాడీ ముందే రివీల్ చేసేశాడు. రేపటి నుండి భూమిక గారు కూడా పోస్టర్స్ పై కనిపిస్తారు. " అంటూ చెప్పుకున్నాడు.

సినిమాలో మదర్ సెంటిమెంట్ తో పాటు మరో రెండు మూడు ట్విస్టులు కూడా ప్లాన్ చేసుకున్నాడు కొత్త దర్శకుడు నరేష్ ముఖ్యంగా ఓ ట్విస్ట్ కి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. రాసుపెట్టుకోండి అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పాడు విశ్వక్ . మరి ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే ఆగస్ట్ 14న వరకు వెయిట్ చేయాల్సిందే.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics